Site icon HashtagU Telugu

EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ సరికొత్త రూల్ ఇకపై దానికి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు!

Mixcollage 18 Jan 2024 05 49 Pm 672

Mixcollage 18 Jan 2024 05 49 Pm 672

ఈ రోజుల్లో ఆధార్‌ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమైపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగడం లేదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా కూడా ఆధార్ కార్డు మనతో పాటు తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో వస్తున్నాయి. అలా ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. అందుకే ఈ ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు కీలక అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. కాగా ఆధార్ కార్డు విషయంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ తాజాగా ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేసేందుకు, లేదా సవరించేందుకు ఆధార్‌ కార్డు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.

అంటే ఈపీఎఫ్‌వో ​​ఇకపై ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డును ఉపయోగించదు. ఈపీఎఫ్‌వో చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి మినహాయించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అసోసియేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈపీఎఫ్‌వో ​​ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తాజాగా ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం యూఐడీఏఐ నుంచి లేఖ కూడా అందింది. పుట్టిన తేదీని మార్చుకుంటే ఆధార్ కార్డు చెల్లదని పేర్కొంది.

కాగా ఈపీఎఫ్‌వో వివరాల ప్రకారం.. ఈ మార్పు చేసుకునేందుకు జనన ధృవీకరణ పత్రం ద్వారా చేసుకోవచ్చు. ఇదే కాకుండా మార్క్ షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పొందిన పాఠశాల బదిలీ సర్టిఫికేట్ కూడా ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్ సర్టిఫికేట్‌, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చని తాజాగా తెలిపింది. ఆధార్ కార్డునే గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ తెలిపింది. కానీ, దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదు. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది భారత ప్రభుత్వంచే జారీ చేయబడింది. ఇది మీ గుర్తింపు, శాశ్వత నివాసానికి రుజువుగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అయితే, ఆధార్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు, వ్యక్తులు వివిధ పత్రాల ప్రకారం వారి పుట్టిన తేదీని నమోదు చేశారు. అందుకే ఇది జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించరాదని తెలిపింది.

Exit mobile version