Enjoy The Moon: 14 లక్షల కోట్లతో దక్షిణ కొరియా మానవ రహిత లూనార్ మిషన్.. ఆగస్టు 4న ప్రయోగం!!

దక్షిణ కొరియా తొలిసారిగా ఆగస్టు 4న మానవ రహిత చంద్రయాత్రను నిర్వహించనుంది.

  • Written By:
  • Updated On - August 6, 2022 / 01:51 PM IST

దక్షిణ కొరియా తొలిసారిగా ఆగస్టు 4న మానవ రహిత చంద్రయాత్రను నిర్వహించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో అభివృద్ధి చేసిన కొరియా పాత్ ఫైండర్ లూనార్ ఆర్బిటర్ (కే పీ ఎల్ ఓ) ను ప్రయోగించనుంది. ఈ మిషన్ కు “దనురి” అని పేరు పెట్టారు. దనురి అంటే.. కొరియా భాషలో “చంద్రుడిని ఆనందించు” అని అర్ధం.ఈ మిషన్ ను లాంచ్ చేస్తే ప్రపంచంలో మానవ రహిత చంద్రయాత్ర నిర్వహించిన 7వ దేశంగా దక్షిణ కొరియా నిలువనుంది.

ఏమిటీ “మిషన్” ?

కే పీ ఎల్ ఓ మూన్
ఆర్బిటర్ ను కొరియా ఏరో స్పేస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చంద్రుడి ఉపరితలంపై 100 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతూ ..చంద్రుడిపై చోటుచేసుకునే మార్పులను నమోదు చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రయోగానికి అవసరమైన పే లోడ్స్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, న్యావిగేషన్ టెక్నాలజీని అమెరికా కు చెందిన నాసా నుంచి తీసుకున్నారు. ఆగస్టు 4న అమెరికాలోని కేప్ కెనవరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఆర్బిటర్ ను ప్రయోగిస్తారు. సూర్యుడు, భూమికి చెందిన గురుత్వాకర్షణ బలాన్ని వినియోగించుకొని ఈ ఆర్బిటర్ డిసెంబరు 2వ వారం కల్లా చంద్రుడి పై నిర్ణీత కక్ష్యలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.14 లక్షల కోట్లు.

ఎందుకు ఈ “మిషన్” ?

చంద్రుడి ఉపరితలంపై 100
కిలోమీటర్ల ఎత్తున ఎగురుతూ ఉండేలా తయారు చేసిన ఈ ఆర్బిటర్ బరువు 678 కిలోగ్రాములు. దీని జీవిత కాలం ఒక ఏడాది. చంద్రుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం ప్రభావం ఎంత ? అనేది గుర్తించేందుకు శక్తివంతమైన కెమెరాలను ఈ ఆర్బిటర్ కు అమర్చారు. చంద్రుడి ఉపరితలం పై ఉండే పదార్థాల ఫోటోలను సైతం ఈ కెమెరాలు అద్భుత క్లారిటీ తో తీయగలవు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ అండ్ టెలి కమ్యూనికేషన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసిన
స్పేస్ ఇంటర్నెట్ టెస్ట్ ఎక్విప్మెంట్ ను కూడా ఈ ఆర్బిటర్ తో పాటు పంపిస్తున్నారు. చంద్రుడి పై ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా వాడొచ్చ? ఈక్రమంలో ఎదురయ్యే అవాంతరాలు ఏమిటి? అనేది తెలుసుకునేందుకు స్పేస్ ఇంటర్నెట్ టెస్ట్ ఎక్విప్మెంట్ ను వాడనున్నారు.

ఉత్తర కొరియా వార్నింగ్..

ఇక తమతో పెట్టుకుంటే అణ్వస్త్రాలు వేస్తామని ఉత్తర కొరియా నియంత కిమ్ మళ్ళీ హెచ్చరించాడు. ఈనేపథ్యంలో ఈ వారంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్నాయి.