Site icon HashtagU Telugu

Nokia – HMD : ‘నోకియా’ పోయే.. ‘హెచ్ఎండీ’ వచ్చే.. పెద్ద మార్పు!

Nokia Hmd

Nokia Hmd

Nokia – HMD : నోకియా బేసిక్ వర్షన్ సెల్ ఫోన్లు క్రియేట్ చేసిన  సంచలనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కాలక్రమంలో టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకోక.. శామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లతో పోటీపడలేక నోకియా చాప చుట్టేయాల్సి వచ్చింది. తదనంతరం 2014లో ఆ కంపెనీ పేరుపై హక్కులను మైక్రోసాఫ్ట్‌కు పదేళ్ల పాటు  కట్టబెట్టారు. అయితే ఆరు నెలల్లోనే మైక్రోసాఫ్ట్  డ్రాప్ అయిపోయింది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్ అనే తైవాన్ కంపెనీ నోకియా హక్కులను పదేళ్ల కాలం కోసం కొనుగోలు చేసింది. ఈ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీకి.. యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్ కాన్‌కు సంబంధం ఉంది. ఎందుకంటే ఫాక్స్ కాన్ ఓనర్.. హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ ఓనర్ ఒకరే. ‘‘టెర్రీ గౌ’’ ఈ రెండు కంపెనీల(Nokia – HMD) యజమాని.

We’re now on WhatsApp. Click to Join

2014లో పదేళ్ల కోసం నోకియా పేరుపై హెచ్ఎండీ గ్లోబల్ తీసుకున్న హక్కుల గడువు త్వరలో ముగియబోతోంది. దీంతో హెచ్ఎండీ గ్లోబల్  కంపెనీ కొత్త ప్లాన్ వేసింది. నోకియా బ్రాండ్‌తో గత పదేళ్లలో ఉత్పత్తి చేసిన ఫోన్లకు మార్కెట్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఈనేపథ్యంలో ఇక నోకియా పేరుతో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని ఆపేయాలని  హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ డిసైడయ్యింది. అంటే ఇకపై మనకు నోకియా బ్రాండ్‌తో స్మార్ట్ ఫోన్లు కూడా కనిపించవు. నోకియా పేరుకు బదులు తమ కంపెనీ పేరు ‘హెచ్ఎండీ’నే వినియోగిస్తామని హెచ్ఎండీ గ్లోబల్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెచ్ఎండీ గ్లోబల్ మొదటి స్మార్ట్ ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో రిలీజ్ చేయబోతున్నారు. నోకియా మొబైల్ అధికారిక వెబ్ ‌సైట్‌ను కూడా హెచ్ఎండీ పేరుతో రీబ్రాండ్ చేయనున్నారట. అంటే నోకియా శకం ఇక ముగిసినట్టే. కాగా, ఈ ఏడాది  చివరకు నోకియాకు సంబంధించిన కొన్ని మోడల్స్ మార్కెట్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

Also Read :Taj Mahal Urs : తాజ్‌మహల్‌పై ‘హిందూ మహాసభ’ పిటిషన్.. ఎందుకో తెలుసా ?

జియోతో నోకియా ఒప్పందం

భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో(Reliance Jio).. నోకియాతో(Nokia) గతేడాది భారీ ఒప్పందం చేసుకుంది. 5జీ నెట్‌వర్క్ పరికరాలను కోనుగోలు చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం విలువ $1.7బిలియన్లు. అంటే మన కరెన్సీలో రూ.14,016 కోట్లు.  2022 ఆగస్టులో జరిగిన 5జీ స్ప్రెక్టమ్ వేలంలో (5G spectrum auction) రిలయన్స్ జియో $11 బిలియన్‌ల విలువ చేసే ఎయిర్‌వేవ్‌లను దక్కించుకుంది. దీని విలువ మన భారతదేశ కరెన్సీలో రూ.90,600 కోట్లు. ఈ వేలం అనంతరం జియో అనేక నగరాల్లో 5జీ నెట్‌వర్క్ సేవలను కూడా ప్రారంభించింది. అలాగే 5జీ స్మార్ట్ ఫోన్లను తయారు చేయడానికి ఆల్ఫాబెట్ గూగుల్‌తో కలిసి పనిచేస్తుంది. భారతదేశంలో 5G డేటా వేగం 4G కంటే 10 రెట్లు వేగంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఈ నెట్‌వర్క్ కీలకపాత్ర పోషించే అవకాశాలున్నాయి.