Blindsight Device : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటిగా వరుస విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవలే ఆయనకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ నలుగురు వ్యోమగాములతో తొలిసారిగా స్పేస్ వాక్ చేయించింది. స్పేస్ వాక్ చేయాలనే తన కోరికను నెరవేర్చినందుకు ఒక బిలియనీర్ ఏకంగా రూ.1600 కోట్ల ఫీజును స్పేస్ ఎక్స్ కంపెనీకి చెల్లించుకున్నాడు. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ కీలక పురోగతిని సాధించింది. పుట్టుకతో అంధులుగా జన్మించిన వారికి చూసే అవకాశాన్ని కల్పించే పరికరం తయారీకి అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) విభాగం నుంచి న్యూరాలింక్‌కు అనుమతి లభించింది.
Also Read :Mohana Singh : మోహనాసింగ్ రికార్డ్ .. తేజస్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా పైలట్
ఈ కంపెనీ తయారు చేయబోయే బ్లైండ్ సైట్ పరికరం అంధులకు(Blindsight Device) చాలా ఉపయోగపడుతుంది. మన మెదడులో ఆప్టిక్ నరాలు ఉంటాయి. అవి యాక్టివ్‌గా ఉంటేనే మనకు కళ్లు కనిపిస్తాయి. అంధులలో ఇవి యాక్టివ్‌గా ఉండవు. న్యూరాలింక్ కంపెనీ ఒక చిప్‌ను తయారు చేసి మెదడులోని ఆప్టిక్ నరానికి అనుసంధానం చేస్తుంది. దాన్ని కళ్లద్దాలకు లింక్ చేస్తుంది. న్యూరాలింక్‌కు చెందిన బ్రెయిన్ చిప్, కళ్లద్దాలు అనుసంధానంతో పనిచేస్తూ.. ఎదుట ఉన్న సీన్లను అంధులకు చూపిస్తాయి.
Also Read :Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు
తొలివిడతలో ఈ డివైజ్ ద్వారా కనిపించే సీన్లు అంత క్లారిటీతో ఉండకపోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. క్రమక్రమంగా సీన్లు స్పష్టంగా కనిపిస్తాయని అంటున్నారు. అతినీలలోహిత కిరణాలను కూడా దీనిద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతారని సైంటిస్టులు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా మరో 8 మంది రోగులకు బ్రెయిన్ చిప్‌లను అమర్చాలని ప్లాన్ చేస్తున్నామని ఇటీవలే ఎలాన్ మస్క్ వెల్లడించారు. వీటి ద్వారా పక్షవాతం బారినపడిన రోగులు డిజిటల్ డివైజ్‌లను సునాయాసంగా మెదడు నుంచి సందేశాలను పంపి కంట్రోల్/ఆపరేట్ చేయొచ్చన్నారు.