Elon Musk Plan: ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా..? అయితే నెలకు ₹.1,600/- చెల్లించండి..!!

  • Written By:
  • Updated On - October 31, 2022 / 12:16 PM IST

ఎట్టకేలకు ట్విట్టర్ డీల్ కంప్లీట్ అయ్యింది. ఎలన్ మస్క్ మొత్తానికి ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ లో మార్పులపై సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మార్పులతో కంపెనీకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీంతో ట్విట్టర్ బ్లూ టిక్ లకు కూడా ఛార్జ్ వేయాలని మస్క్ నిర్ణయించారని ది వెర్జ్ నివేదిక వెల్లడించింది. ట్విట్టర్ సభ్యులకు మాత్రమే బ్లూ టిక్ ఇవ్వబడతాయంటూ నివేదిక పేర్కొంది. ప్రొఫైల్ పేరు పక్కన బ్లూ టిక్ కావాలంటే కంపెనీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఇందులో అనేక అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి. ఎడిట్ ట్వీట్, అన్ డో ట్వీట్ వంటి ఫీచర్లు కనిపిస్తాయి. అంటే ట్విట్టర్ బ్లూ టిక్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వబడుతుంది. ఇది పొందాలంటే సుమారు నెలకు రూ. 1600చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటికే ట్విట్టర్ లో వెరిఫై అయిన వారికి బ్లూ టిక్ కోసం సబ్ స్క్రయిబ్ చేసుకునేందుకు మూడు నెలల సమయం ఇస్తుంది. లేదంటే వారి పేరు ముందున్న బ్లూటిక్ ను తొలగిస్తారు. అయితే ఈ నిబంధనలో ఏవైనా మార్పులు చేస్తుందా లేదా అనేది స్పష్టం చేయలేదు. ట్విట్టర్ ను సొంతం చేసుకుని ఒక వారం కూడా గడవకముందు మస్క్ పెద్ద మార్పులకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ సీఈవో నుంచి పరాగ్ అగర్వాల్ తోపాటు చాలామందిని తొలగించారు.