Elon Musk : ఐఫోన్లలో ఛాట్ జీపీటీ.. భారతీయ మీమ్‌తో ‘మస్క్’ కౌంటర్

యాపిల్ కంపెనీపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ భగ్గుమంటున్నారు.

  • Written By:
  • Updated On - June 11, 2024 / 12:33 PM IST

Elon Musk : యాపిల్ కంపెనీపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ భగ్గుమంటున్నారు. ప్రత్యేకించి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఛాట్ బాట్ ChatGPTని తయారు చేసిన OpenAI కంపెనీతో యాపిల్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లలో ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ఛాట్ జీపీటీ ఒకవేళ చేరితే..  యూజర్ల విలువైన వ్యక్తిగత సమాచారం భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విధంగా భవిష్యత్తులో ఐఫోన్లు రూపుదిద్దుకుంటే తమ కంపెనీ ఉద్యోగులు ఐఫోన్లు వాడటాన్ని బ్యాన్ చేస్తానని మస్క్ ప్రకటించారు. ఐఫోన్లు సెక్యూరిటీ రూంలో అప్పగించాకే.. ఆఫీసు లోపలికి ఉద్యోగులు వచ్చేలా రూల్స్ తెస్తామని ఆయన వెల్లడించారు.  యాపిల్ కంపెనీకి సొంతంగా ఏఐ ఛాట్ బాట్ తయారు చేసుకునేంత తెలివి లేదని మస్క్ కామెంట్ చేశారు.

Also Read :Sonakshi Weds Zaheer : సోనాక్షితో జహీర్ పెళ్లి.. శత్రుఘ్న సిన్హా రియాక్షన్ ఇదీ

ఒకవేళ యాపిల్ ఐఓఎస్‌ సాఫ్ట్‌వేర్‌లోకి ఛాట్ జీపీటీని చేరిస్తే..  యూజర్ల డేటాకు భద్రత లేకుండా పోతుందన్నారు. ఈవిషయాన్ని యూజర్లు కూడా గుర్తుంచుకోవాలన్నారు. ఈ అంశాలన్నీ అద్దంపట్టేలా ప్రఖ్యాత భారతీయ మీమ్ ఒకదాన్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ మీమ్‌లో ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి ఓ కొబ్బరిబోండంలో రెండు స్ట్రాలు వేసుకొని కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు. ఈక్రమంలో ఒకరి కళ్లలోకి మరొకటి చూసుకుంటున్నారు. ఈ మీమ్‌లోని మహిళకు యాపిల్ కంపెనీ‌ అని.. పురుషుడికి ఓపెన్ ఏఐ అని.. కొబ్బరి బోండానికి ఐఫోన్ అని.. స్ట్రాలలోని కొబ్బరి నీళ్లను యూజర్ల సమాచారంగా పేర్కొన్నారు. ఐఫోన్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ ఈ మీమ్‌లో ఉన్నవిధంగానే పనిచేస్తుందని ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు.