Elon Musk On Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ పై ఎలాన్ మస్క్ ట్రోలింగ్

మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్‌ పై ఎలాం మస్క్ ఆసక్తికరంగా స్పందించారు. ఒకవిధంగా మస్క్ మైక్రోసాఫ్ట్ ని ట్రోల్ చేసినట్టే అనుకోవాలి. మస్క్ X హ్యాండిల్‌లో ఒక ఫోటోని పంచుకున్నారు

Elon Musk On Microsoft: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్‌టైమ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల మైక్రోసాఫ్ట్ సిస్టమ్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు కూడా దీని బారిన పడ్డాయి. ప్రస్తుతానికి అయితే ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. కాగా మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్‌ పై ఎలాం మస్క్ ఆసక్తికరంగా స్పందించారు. ఒకవిధంగా మస్క్ మైక్రోసాఫ్ట్ ని ట్రోల్ చేసినట్టే అనుకోవాలి. మస్క్ X హ్యాండిల్‌లో ఒక ఫోటోని పంచుకున్నారు. ట్రోలర్ ని తలపించేలా ఆ ఫోటో ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తిగా స్పందిస్తున్నారు.

మస్క్ అక్టోబర్ 2021లో పోస్ట్ చేసిన దాన్ని రీపోస్టు చేశాడు. “మాక్రోహార్డ్ >> మైక్రోసాఫ్ట్ అని రాశాడు. మస్క్ X హ్యాండిల్‌లో ఒక ఫోటోని పంచుకున్నారు. ట్రోలర్ ని తలపించేలా ఆ ఫోటో ఉండటంతో నెటిజన్లు కూడా ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎలాన్ మస్క్ ఫాస్ట్ చేసిన ఫొటోలో X అనే వ్యక్తి పైభాగంలో పడుకుని సేద తీరుతుంటాడు. అయితే కింద భాగంలో చాలా మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. కింద వాళ్ళని మైక్రోసాఫ్ట్ గా చిత్రీకరించారు. అంటే దీని అర్ధం ఏంటంటే మీరంతా ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు అన్నట్టు అర్ధం వస్తుంది. మీకు సమస్య కావొచ్చు, నాకు కాదు అన్నట్టుగా ఉంది ఆ ఫోటో వెనుక అర్ధం.

కాగా మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్లో ఆకస్మిక లోపం కారణంగా ప్రపంచం మొత్తం సాంకేతిక సమస్యలతో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ అవుట్‌టేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి.

Also Read: Supreme Court : నేర విచారణ నుండి గవర్నర్లకు రక్షణపై..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Follow us