Musk Vs Parag : 21 ఏళ్ల కుర్రాడి వల్లే ట్విట్టర్‌ను మస్క్ కొన్నాడట.. ఎందుకో తెలుసా ?

Musk Vs Parag : ఎలాన్ మస్క్.. ప్రపంచంలోని అత్యంత ధనికుల టాప్ - 5 లిస్టులో ఈయన పేరు ఉంటుంది.

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 12:40 PM IST

Musk Vs Parag : ఎలాన్ మస్క్.. ప్రపంచంలోని అత్యంత ధనికుల టాప్ – 5 లిస్టులో ఈయన పేరు ఉంటుంది. ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరా లింక్ వంటి ఎన్నో సక్సెస్ ఫుల్ కంపెనీలు ఈయనవే. అయితే ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనడానికి దారితీసిన పరిస్థితులు పూర్తిగా విభిన్నమైనవని చెబుతుంటారు. దీనిపై చాలా కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ కర్ట్ వాగ్నర్ రచించిన ‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’ పుస్తకంలో  ట్విట్టర్ కొనుగోలుతో ముడిపడిన పలు ఆసక్తికర విశేషాలు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 20న విడుదలకానున్న ఈ పుస్తకంలో ఒక భారతీయుడి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయనెవరు ? మస్క్‌కు ఆ భారతీయుడికి మధ్య ఏం జరిగింది ?  వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join

రూ.4 లక్షలు ఇస్తానంటే.. రూ.40 లక్షలు అడిగాడు

‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’ పుస్తకం ప్రకారం.. ఎలాన్ మస్క్ వ్యాపార కోణంలో ట్విట్టర్‌ను కొనలేదట. వ్యక్తిగతమైన కొన్ని కారణాలతో 2022  సంవత్సరం జనవరిలో ట్విట్టర్‌ను  మస్క్ రూ.365 కోట్లకు కొన్నారని పుస్తకంలో రచయిత కర్ట్ వాగ్నర్ ప్రస్తావించాడు. జాక్ స్వీనీ 21 ఏళ్ల కాలేజీ విద్యార్థి. ఇతడికి సెలబ్రిటీల ప్రైవేటు ప్రయాణాల మీద బాగా ఆసక్తి ఉండేది. అమెరికాలోని చాలామంది సెలబ్రిటీల పేరు మీద ఇతడు వేర్వేరుగా ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేసి.. వాటిలో ఆయా సెలబ్రిటీల ప్రయాణాల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేవాడు. అంతేకాదు ఆ సెలబ్రిటీల ప్రైవేటు ప్రయాణాల వల్ల జరుగుతున్న పర్యావరణ కాలుష్యం వివరాలను, వాతావరణంలోకి రిలీజ్ అవుతున్న కార్బన్ డయాక్సైడ్ మోతాదు సమాచారాన్ని కూడా తన ట్వీట్టలో ప్రస్తావించేవాడు.  ఎలాన్ మస్క్ ప్రైవేటు ప్రయాణాల వల్ల కలుగుతున్న వాతావరణం కాలుష్యం వివరాలను  బయట పెట్టేందుకు  జాక్ స్వీనీ ఒక ట్విట్టర్ అకౌంట్‌ను నిర్వహించే వాడు. దాని పేరు..  @ElonJet.  ఈ అకౌంట్‌ను ఒకసారి చూసి విస్మయానికి గురైన ఎలాన్ మస్క్.. వెంటనే జాక్ స్వీనీని కాంటాక్ట్ చేసి ‘‘రూ.4లక్షలు ఇస్తాను.. నన్ను ట్రాక్ చేయడం ఆపేయ్’ అని చెప్పారు. అయితే అందుకు జాక్ నో చెప్పాడు. ‘‘నాకు రూ.40 లక్షలు ఇవ్వండి.. లేదంటే మీ కంపెనీలో ఇంటర్న్ షిప్ ఇవ్వండి’’ అని ఎలాన్ మస్క్‌ను జాక్ స్వీనీ డిమాండ్ చేశాడు.

Also Read : Google Driverless Car : గూగుల్ డ్రైవర్ లెస్ కారుకు నిప్పు.. అసలేం జరిగింది ?

మస్క్ కొడుకుపై మర్డర్ అటెంప్ట్‌తో..

దీంతో చేసేది లేక నేరుగా ఆనాటి ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను మస్క్ సంప్రదించారట.  @ElonJet ట్విట్టర్ హ్యాండిల్ వల్ల తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని.. వెంటనే ఆ హ్యాండిల్‌ను సస్పెండ్ చేయాలని రిక్వెస్ట్ చేశారట. అయితే అందుకు పరాగ్ అగర్వాల్ కూడా నో చెప్పారట. ఈ పరిణామం జరిగిన కొన్నాళ్ల తర్వాత ఎలాన్ మస్క్‌కు చెందిన ఓ కుమారుడిని తీసుకెళ్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి యత్నించాడు. జాక్ స్వీని నిర్వహిస్తున్న @ElonJet ట్విట్టర్ హ్యాండిల్ వల్లే మస్క్ కుటుంబం ప్రయాణాల ప్రైవేటు సమాచారం లీకవుతోందని పోలీసులు గుర్తిస్తారు. ఈ ఘటనపై ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ లీగల్ నోటీసులు పంపడంతో.. ఎట్టకేలకు  @ElonJet ట్విట్టర్ హ్యాండిల్‌పై బ్యాన్ అమల్లోకి వచ్చింది.  వాస్తవానికి ఆనాటి ట్విట్టర్ సీఈవో  పరాగ్ అగర్వాల్‌ తనను పెద్దగా పట్టించుకోకపోవడం.. ఖరాఖండిగా నో చెప్పడంతో ఎలాన్ మస్క్ ఈగో దెబ్బతిందట. ఆ క్షణంలోనే ట్విట్టర్‌ను కొనేయాలనే నిర్ణయానికి ఎలాన్ మస్క్ వచ్చారని కర్ట్ వాగ్నర్ తన పుస్తకం ‘బ్యాటిల్ ఫర్ ది బర్డ్’‌లో చెప్పుకొచ్చారు. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే పరాగ్ అగర్వాల్‌ను సీఈవో పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.