Twitter : మస్క్ మరో కొత్త ప్రకటన…ట్విట్టర్ లో నాయకులు, సెలబ్రిటీల ప్రొఫైల్ పై స్పెషల్ ట్యాగ్…!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 09:53 AM IST

ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఒక్కపక్కన ఉండటం లేదు. ఏదొక కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సహా ఎగ్జిక్యూటివ్ లను తొలిగింపు, బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే..ట్విట్టర్ లో రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ప్రొఫైల్ పై సెంకడరీ ట్యాగ్ లను తీసుకురావడం గురించి ప్రకటించారు.

మస్క్ చెబుతున్న సెకండరీ ట్యాగ్ ఏంటంటే…అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ట్విట్టర్ అకౌంట్లో చూడవచ్చు. జోబైడెన్ పేరుతో సెకండ్ ట్యాక్ ఉంది. యూనైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ అధికారి అని రాసి ఉంది. అయితే ఈ ట్యాగ్ ఇంకా భారత్ లోని రాజకీయనాయకులకు ఇవ్వలేదు. ట్విట్టర్ పేర్కొన్న ప్రకారం…ఒక దేశంతో అనుబంధించబడిన ట్విట్టర్ అకౌంట్స్ సెకండరీ ట్యాగ్ ల ద్వారా ఆ ఖాతాల గురించి అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఈ ట్యాగ్ లు ప్రభుత్వాలకు చెందిన అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ మీడియా సంస్థలు, ఆ సంస్థలతో అనుబంధించబడిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ లేబుల్ సంబంధిత ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పేజీలో కనిపిస్తుంది. ట్యాగులో ఖాతాలు ఏ దేశానికి చెందినవి…ప్రభుత్వ ప్రతినిధివా లేదా రాష్ట్ర అనుబంధ మీడియా ద్వారా నిర్వహించబడుతుందా అనే పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది.

సెకండరీ ట్యాగ్ ఎవరీ ఇస్తారు
ట్విట్టర్ సమాచారం ప్రకారం…ఒక దేశంలోని సీనియర్ అధికారులు, సంస్థలకు ఆ దేశ అధికారిక వాయిస్ అయిన సెకండరీ ట్యాగ్ కేటాయిస్తారు. ప్రత్యేకంగా ఈ ట్యాగ్ దేశాధినేత, విదేశాంగమంత్రులు సంస్థాగత సంస్థలు, రాయబారులు, అధికారిక ప్రతినిధులు, రక్షణ అధికారులు, ప్రముఖ దౌత్య నాయకులతోసహా కీలకమైన ప్రభుత్వ అధికారులకు మాత్రమే కేటాయిస్తారు. అదే విధంగా మీడియా సంస్థలు, ఆర్థిక వనరులు, ప్రత్యేక్ష లేదా పరోక్ష రాజకీయ ఒత్తిడి ద్వారా సంపాదకీయ కంటెంట్ను నియంత్రించే దేశానికి సంబంధించిన మీడియాగా పరిగణిస్తారు. రాష్ట్ర అనుబంధ మీడియా సంస్థలకు చెందిన అకౌంట్స్ వాటి CEOలేదా వారి ముఖ్య ఉద్యోగులకు సెకండరీ ట్యాగ్ ఇవ్వబడుతుంది.

సెకండరీ ట్యాగ్ ఏయే దేశాల్లో ఉంది
ప్రస్తుతం, ద్వితీయ ట్యాగ్ చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్, బెలారస్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, క్యూబా… ఈక్వెడార్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, సెర్బియా, సౌదీ అరేబియా, టర్కీ, థాయ్‌లాండ్‌తో సహా అన్ని దేశాల్లో విడుదల చేశారు. ఇందులో భారత్ ను ఇంకా చేర్చలేదు. అయితే భవిష్యత్తులో మరిన్ని దేశాలను చేర్చుకుంటామని ట్విట్టర్ వెల్లడించింది.