Your Tweets Vs Musk plan : “మస్క్” మస్త్ ప్లాన్.. మన ట్వీట్లను ఇలా వాడుకుంటారట

  • Written By:
  • Updated On - July 15, 2023 / 08:51 AM IST

Your Tweets Vs Musk plan : బిజినెస్ ప్లాన్ అంటే ఇదే.. 

చివరకు ట్విట్టర్ లో నెటిజన్స్ ట్వీట్లను కూడా వాడుకునేలా ఆ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ స్కెచ్ రెడీ చేశారు.. 

తన కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ కంపెనీ  “xAI” కోసం ట్వీట్లను వాడుకుంటానని ఆయన వెల్లడించారు.

ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్‌ ఏఐలకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్న  ఎలాన్ మస్క్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. xAI యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌లకు ట్రైనింగ్ ఇవ్వడానికి Twitterలోని పబ్లిక్ ట్వీట్‌లను ఉపయోగించాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నాడు. టెక్స్ట్, ఇమేజ్, వీడియో ఫార్మాట్లలో నెటిజన్స్ కు ఎక్కువగా ఆసక్తి ఉన్న టాపిక్స్ ఏమిటి ? ఏయే టాపిక్స్ పై నెటిజెన్స్ ఇంట్రెస్ట్ ఎలా మారుతోంది ?  అనేది xAI గుర్తిస్తుంది.

Also read : Hyderabad-Skyroot : హైదరాబాద్ “స్కై రూట్” రాకెట్లతో ఫ్రాన్స్ శాటిలైట్ల మోహరింపు.. ఖరారైన డీల్

ఈ సమాచారాన్ని అనుగుణమైన  AI ప్రోడక్ట్స్ ను యూజర్స్ కోసం రెడీ చేస్తుంది.  టెస్లా కంపెనీ ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ కార్ల సామర్థ్యాలను అభివృద్ధి చేసి, సెల్ఫ్ డ్రైవింగ్ ను మరింత సురక్షితంగా మార్చేందుకు  అవసరమైన  AI ప్రోడక్ట్స్ ను కూడా  xAI తయారు చేస్తుంది. xAI అనేది ట్విట్టర్ , టెస్లాలతో కలిసి పని చేస్తుందని(Your Tweets Vs Musk plan) ఎలాన్ మస్క్ వెల్లడించారు.

Also read : Scorpene Submarines : 26000 కోట్లతో 3 స్కార్పీన్ లు.. భారత్ లో తయారీకి ఫ్రాన్స్ తో డీల్