Xmail : ‘ఎక్స్ మెయిల్’ వస్తోంది.. జీమెయిల్‌కు ఇక పోటీ

Xmail : ‘ఈమెయిల్’ అనగానే ప్రస్తుతం అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ‘జీమెయిల్’.

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 08:18 AM IST

Xmail : ‘ఈమెయిల్’ అనగానే ప్రస్తుతం అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది ‘జీమెయిల్’. ప్రపంచ వ్యాప్తంగా అంతగా గూగుల్ జీమెయిల్ ఫేమస్ అయింది. ఇప్పుడు ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’ (ట్విట్టర్) కూడా ఈమెయిల్ సర్వీసును తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. దానికి ‘ఎక్స్ మెయిల్’ అనే పేరు పెడతారట. ఈవిషయాన్నిస్వయంగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

గూగుల్ ‘జీమెయిల్‌’కు పోటీగా ‘ఎక్స్ మెయిల్’ (Xmail) సర్వీసును ప్రారంభించేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు.  దీనిపై గత కొన్ని వారాలుగా ఆయన బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారట. కంపెనీకి చెందిన నిపుణుల టీమ్‌తో చర్చించినా తర్వాతే.. ఎక్స్ మెయిల్ సర్వీసు గురించి ఎలాన్ మస్క్ ప్రకటన చేశారని తెలుస్తోంది. అంటే చాలా దశాబ్దాల తర్వాత తొలిసారిగా జీమెయిల్‌కు ప్రత్యామ్నాయం రిలీజ్ కాబోతోందన్న మాట. ఈమెయిల్ సర్వీసుల విభాగంలో గూగుల్‌ను ఛాలెంజ్ చేసేందుకు మరో పెద్ద కంపెనీ రెడీ కావడం నెటిజన్లకు ఒక రకంగా పెద్ద శుభవార్తే. దీంతో ఎక్స్ మెయిల్ సర్వీసు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆతుర్తగా ఎదురు చూస్తున్నారు.

Also Read : Murder : ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య.. ఎలా జరిగిందంటే..

‘ఎక్స్ మెయిల్’ సర్వీసు ఎలా ఉంటుంది ? దానిలోని ఫీచర్లు ఎలా పనిచేస్తాయి ?  ప్రీమియం సేవలు ఏమైనా ఉంటాయా ? అనేది వేచి చూడాలి.  ఎందుకంటే ట్విట్టర్‌ను కొనేసిన తర్వాత ఎలాన్ మస్క్.. దానిలో చాలా సర్వీసులను ప్రీమియం కేటగిరిలోకి మార్చేశారు. ప్రత్యేక పేమెంట్ చేసి ఆయా సర్వీసులను వాడుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈనేపథ్యంలో ఎక్స్ మెయిల్ సర్వీసులోనూ ఏవైనా ఫీచర్ల కోసం పేమెంట్ చేయాల్సి ఉంటుందా ? లేదా ? అనేది చూడాల్సి ఉంది. స్టార్ లింక్ కూడా ఎలాన్ మస్క్ కంపెనీయే. స్టార్ లింక్ టెక్నాలజీతో ఇంటర్నెట్ నెట్ వర్క్ లేని చోటు నుంచి కూడా ఎక్స్ మెయిల్‌ను పంపే వెసులుబాటు కల్పిస్తారా ? అనేది కూడా ఆసక్తికర అంశం. ఈ అంశాలు అన్నింటిపై  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వాడివేడి చర్చ నడుస్తోంది. జీమెయిల్ సర్వీసులోని కొన్ని ఫీచర్లను త్వరలోనే ఆపేస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎక్స్ మెయిల్‌పై ఎలాన్ మస్క్ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Also Read :Operation Valentine : ఆపరేషన్ వాలెంటైన్ అందరు చూడాల్సిన చిత్రం – చిరంజీవి