X Fee : పోస్ట్, రిప్లై ఆప్షన్లు కావాలంటే పేమెంట్ చేయాల్సిందే : మస్క్

X Fee : ఇకపై ఎక్స్ (ట్విట్టర్)లో కొత్త యూజర్లపై వీర బాదుడు తప్పేలా లేదు. వాళ్లు చేసే ప్రతీ పోస్టుకు.. పెట్టే ప్రతీ రిప్లైకు కూడా పేమెంట్ చేయాల్సి రావచ్చు.

  • Written By:
  • Updated On - April 16, 2024 / 02:17 PM IST

X Fee : ఇకపై ఎక్స్ (ట్విట్టర్)లో కొత్త యూజర్లపై వీర బాదుడు తప్పేలా లేదు. వాళ్లు చేసే ప్రతీ పోస్టుకు.. పెట్టే ప్రతీ రిప్లైకు కూడా పేమెంట్ చేయాల్సి రావచ్చు. ఈవిషయాన్ని స్వయంగా ‘ఎక్స్’ యజమాని ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ప్రకటించారు.  పోస్ట్ రాయడానికి, రిప్లై ఇవ్వడానికి  కొత్త యూజర్లు చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావచ్చని మస్క్ చెప్పారు. ‘బాట్స్‌’ (bots) సమస్యకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం(X Fee) తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘ఎక్స్‌ డైలీ న్యూస్‌’ అకౌంట్ నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ మస్క్‌ ఈ విషయాన్ని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

బాట్‌ల సమస్యను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ)  టూల్స్ నివారించలేకపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘క్యాప్చా’ టెస్టులను బాట్‌లు ఈజీగా పాసవుతున్నాయని.. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భవిష్యత్తుల్లో బాట్‌లు ట్విట్టర్‌లో కొత్త అకౌంట్లు తెరవకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే కొత్త యూజర్ల నుంచి స్వల్ప పేమెంట్ వసూలు చేయాలని డిసైడ్ చేసినట్లు మస్క్ చెప్పారు. ఒకవేళ ఎక్స్‌ కొత్త యూజర్లు ఫీజు చెల్లించకపోయినా పోస్ట్‌ చేసేందుకు ఛాన్స్ కల్పిస్తామని.. అయితే వారు కనీసం 3 నెలల పాటు వేచిచూడాలని మస్క్ అన్నారు. 3 నెలల తర్వాత వారికి పోస్టులు పెట్టేందుకు యాక్సెస్ లభిస్తుందని  పేర్కొన్నారు. ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం మస్క్ చెప్పలేదు.

Also Read :Maoist Party : ఇంద్రవెల్లి పోరాటాన్ని స్మరించుకుంటూ మావోయిస్టుల లేఖ

వాస్తవానికి యూజర్ల నుంచి ఈ తరహా ఛార్జీల వసూలు గురించి గతేడాది అక్టోబర్‌లోనే ‘ఎక్స్‌ సపోర్ట్‌’‌ నుంచి ఒక అప్‌డేట్‌ రిలీజైంది. న్యూజిలాండ్‌, ఫిలిప్పైన్స్‌లలో కొత్త ఎక్స్ ఖాతాలకు ఏడాదికి ఒక డాలర్‌ చొప్పున ఛార్జీని వసూలు చేసే విధానాన్ని  ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.  ఆ దేశాలకు చెందిన కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్‌ను చూడగలరు.. కానీ రిప్లై, రీపోస్ట్‌, కొత్త పోస్ట్‌ రాయడం వంటి ఆప్షన్ల కోసం పేమెంట్ చేయాల్సి ఉంటుందని అప్పట్లో వెల్లడించారు.  ఇదే విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలకూ విస్తరించే యోచనలో ఎలాన్ మస్క్‌ ఉన్నారట.

Also Read : Seema : సీమా హైదర్‌కు నోయిడా ఫ్యామిలీ కోర్టు సమన్లు