Grok AI : ట్విట్టర్‌లో ‘గ్రోక్ ఏఐ’.. ఎలా పనిచేస్తుంది ?

Grok AI : జనరేటివ్ ఏఐ చాట్‌బాట్స్‌.. అవేనండీ.. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ!!

Published By: HashtagU Telugu Desk
Grok Ai

Grok Ai

Grok AI : జనరేటివ్ ఏఐ చాట్‌బాట్స్‌.. అవేనండీ.. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ!! ఇప్పుడు ఈ లిస్టులో ట్విట్టర్‌ (ఎక్స్)కు చెందిన గ్రోక్ ఏఐ (Grok AI) కూడా చేరబోతోంది. ‘గ్రోక్ ఏఐ’ చాట్‌బాట్‌ను ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని xAI సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని త్వరలోనే ట్విట్టర్‌లో వాడబోతున్నారు. ట్విట్టర్ యూజర్స్‌కు గ్రోక్ ఏఐ తన సేవలను అందించనుంది. వచ్చే వారం ట్విట్టర్ ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్లకు గ్రోక్ AI అందుబాటులోకి వస్తుందని  ఎలాన్ మస్క్ వెల్లడించారు.అయితే  ఏ తేదీన లాంచ్ అవుతుందనేది తెలియజేయలేదు. ‘ఎక్స్ ప్రీమియం+’ అనేది ట్విట్టర్ (ఎక్స్)లో స్పెషల్ ఫీచర్లు, కంటెంట్‌కు యాక్సెస్‌ను అందించే ఒక పెయిడ్ సర్వీస్. ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్‌) ఖాతాలో గ్రోక్ AI ఇచ్చిన కొన్ని రెస్పాన్స్‌ల స్క్రీన్‌షాట్స్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం గ్రోక్ ఏఐ బీటా టెస్టింగ్ దశలోనే ఉంది. ఇది 2 నెలలే ట్రైనింగ్ పొందింది. గ్రోక్ AI  తన యూజర్స్  హెల్ప్‌తో ప్రతి వారం వేగంగా ఇంప్రూవ్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఎలా పనిచేస్తుంది ?

  • గ్రోక్ AI  యూజర్లతో నేరుగా ఇంటరాక్ట్ అవుతుంది.
  • రెబలియస్ స్ట్రీక్, సెన్సాఫ్ హ్యూమర్‌తో గ్రోక్ AI   పనిచేస్తుందని xAI టీమ్ అంటోంది.
  • ఈ చాట్‌బాట్ డగ్లస్ ఆడమ్స్ రచించిన “హిచ్‌ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ” అనే సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్ నుంచి ప్రేరణ పొందింది.
  • ఎలాంటి ప్రశ్నలు అడగాలో సజెస్ట్ చేయడమే కాక, వాటికి తెలివిగా సమాధానం చెప్పేలా ఈ టూల్‌ను రూపొందించారు.
  Last Updated: 24 Nov 2023, 03:07 PM IST