Elon Musk : ఉద్యోగులకు ట్విట్టర్ బాస్ షాక్… సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన..!!

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 09:40 AM IST

ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసి…బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదొక అప్ డేట్ వార్తల్లో ఉంటున్నారు. వచ్చిరాగనే…సీఈవో పరాగ్ అగర్వాల్ తోపాటు సహా ఉద్యోగులను బయటకు పంపించారు. ఆ తర్వాత బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ అంటూ హడావుడి చేశారు. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ లో పనిచేస్తున్న సగంమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు మస్క్. దాదాపు మూడు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం.

ఎలన్ మస్క్ ఖర్చులను తగ్గించుకునేందుకే ఇలాంటి ప్లాన్ చేస్తున్నారని Twitter.In తెలిపింది. దాదాపు 3,700మంది ఉద్యోగులకు కోతపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు పేర్కొంది. ట్విట్టర్ బాస్ ఉద్యోగుల తొలగింపు గురించి పూర్తి వివరాలను శుక్రవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే 3,700మంది ఉద్యోగులను తొలగిస్తున్నారని వస్తున్న వార్తలపై ట్విట్టర్ ఇంకా అధికారిక ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అక్టోబర్ 28న ట్విట్టర్ పగ్గాలు చేతపట్టిన మస్క్ ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయం తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. బోర్డు డైరెక్టర్లను తొలగించడంతోపాటు వేలాది మంది భారతీయుల ట్విట్టర్ అకౌంట్లను బ్యాన్ చేశారు.