Elon Musk : ట్విట్టర్ బ్లూ టిక్ ఫ్రీ కాదు…అది పొందాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే…!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 05:44 AM IST

ఇక నుంచి ట్విట్టర్ బ్లూ టిక్ పొందాలంటే నెలకు 8 నెలల చెల్లించాల్సిందేనని ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపుగా నెలకు 660రూపాయలు చెల్లించాలి. కొనుగోలు శక్తి సమానత్వానికి, దేశానికి అనుగుణంగా ధరను సర్దుబాటు చేసినట్లు మస్క్ తెలిపారు. తానే స్వయంగా బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ధరను ప్రకటించారు. దీంతోపాటు బ్లూ సబ్ స్క్రిప్షన్ కింద యూజర్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో కూడా వివరించారు.

ప్రత్యత్తరం, ప్రస్తావరన, సెర్చింగ్ లో ప్రాధ్యానత ఉంటుంది. ఈ ఫీచర్ తో స్పామ్, స్కామ్స్ ను అరికట్టవచ్చు. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ కింద యూజర్లు ఇప్పుడు పెద్ద వీడియోలు, ఆడియోలను కూడా పోస్టు చేసుకోవచ్చు. సాధారణ యూజర్లతో పోలిస్తే ట్విట్టర్ సబ్ స్క్రైబర్లు సగం ప్రకటనలను మాత్రమే చూస్తారు. పబ్లిషర్లు ట్విట్టర్ తో ఒప్పందం కుదుర్చుకుంటే ట్విట్టర్ బ్లూ చందాదారులు కూడా పెయిడ్ స్టోరీలను ఫ్రీగా చదువుకోవచ్చని మస్క్ చెప్పారు.

ఇలా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ట్విట్టర్ ఆదాయం పెరుగుతుంది. కంటెంట్ క్రియేటర్స్ కూడా బహుమతులు లభిస్తాయని మస్క్ తెలిపారు. అయితే బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ఒక్కదానితో ఆగడు మస్క్. ఎందుకంటే ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు చాలా డబ్బు వెచ్చించాడు. అలాంటి పరిస్థితిలో తాను ట్విట్టర్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ట్విట్టర్ పెద్దగా లాభాల్లో లేకుపోవడంతో…ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయాలతో డబ్బును సంపాదించే ప్రయత్నం మొదలు పెట్టారు మస్క్.