ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది ఈ వాట్సాప్ ని వినియోగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని వినియోగదాల కోసం అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఐదు సరికొత్త ఫీచర్ లని ప్రవేశపెట్టింది. మరి ఆ ఐదు రకాల ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇన్‌స్టంట్ వీడియో మెసేజెస్.. ఈ ఫీచర్ ని వాట్సాప్ సంస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫీచర్ తో 60 సెకన్ల షార్ట్ వీడియో మెసేజెస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు చిటికెలో పంపించుకోవచ్చు. అవి వాయిస్ మెసేజెస్ వలె పనిచేస్తాయి. కానీ మాట్లాడుతున్న వ్యక్తిని వీడియో రూపంలో చూపిస్తాయి. ఇన్‌స్టంట్ వీడియో మెసేజెస్ పంపడానికి, పంపాలనుకుంటున్న చాట్‌ని ఓపెన్ చేసి, మైక్రోఫోన్ ఐకాన్‌పై సింగిల్ ట్యాప్ చేయాలి. ఆపై, కెమెరా ఐకాన్‌ను ప్రెస్ చేస్తే వీడియో రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ పూర్తి చేసిన తర్వాత, కెమెరా ఐకాన్ రిలీజ్ చేసి వీడియోను సెండ్ చేసుకోవచ్చు.
ఎడిట్ మెసేజెస్.. వాట్సాప్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఫీచర్ ని ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లను పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మిస్టేక్స్ ని సరిచేయడానికి లేదా మెసేజ్‌ల్లో చిన్న మార్పులు చేయడానికి యూజర్లు ఎడిట్ బటన్ ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి 15 నిమిషాల్లోపు పంపిన మెసేజ్‌ను హోల్డ్ చేసి పట్టుకొని ఎడిట్ ఆప్షన్‌పై నొక్కి ఎడిటింగ్ చేశాక సెండ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
HD ఫొటోలు.. ఈ ఫీచర్ ని కూడా వాట్సాప్ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా వాట్సప్ లో యూజర్స్ హై క్వాలిటీ ఫొటోలు పంపించుకోవచ్చు. ఫొటో షేర్ చేస్తున్న సమయంలో హెచ్డీ ఐకాన్‌పై నొక్కి హెచ్డీ క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా వాటిని పంపించుకోవచ్చు.
చాట్ లాక్స్.. ఈ ఫీచర్ ని కూడా ఇటీవలే అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో యూజర్స్ నిర్దిష్ట చాట్స్‌ను లాక్ చేసుకోవచ్చు. ఈ చాట్స్‌ను ఫింగర్‌ప్రింట్ స్కాన్, ఫేస్ ఐడీ వంటి అథెంటికేషన్‌తో మాత్రమే యాక్సెస్ చేయడం కుదురుతుంది. కాబట్టి ఇతరులు లాక్ వేసుకున్న చాట్స్‌ను చూసే ప్రసక్తే ఉండదు. ఇది కట్టుదిట్టమైన ప్రైవసీని అందిస్తుందని చెప్పవచ్చు.
సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్.. వాట్సప్ యూజర్లను స్కామ్, స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బంది కలగకుండా వాట్సప్ సైలెన్స్ అనోన్ కలర్స్ అనే కొత్త సేఫ్టీ ఫీచర్‌ను ఇటీవలే పరిచయం చేసింది. దీనితో అన్‌నోన్ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ మ్యూట్ చేసుకోవచ్చు.