New E-Bike: సరికొత్త లుక్ తో ఎలక్ట్రిక్ రేసర్ బైక్.. ధర, ఫీచర్స్ ఇవే?

ఇండియన్ మార్కెట్లో రోజురోజుకీ ఎలక్ట్రానిక్ బైక్స్ కి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంధన ధరలు

  • Written By:
  • Publish Date - January 30, 2023 / 07:30 AM IST

ఇండియన్ మార్కెట్లో రోజురోజుకీ ఎలక్ట్రానిక్ బైక్స్ కి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహన వినియోగ ధరలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలు రకరకాల మోడల్స్ సరికొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటాలియన్ బైక్ తయారీ కంపెనీ ఈ రేసర్ కొత్త ఎలక్ట్రిక్ రేసర్ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

అయితే సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్స్ సౌండ్స్ రావు. దీంతో రైడర్లు సౌండ్ ఎఫెక్ట్ కోల్పోతారు. దీంతో వారి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అనుభవించలేరు. అయితే ఈ ఇబ్బందిని అధిగమిస్తూ ఈ- రేసర్ కంపెనీ జీరో ఎస్ఆర్ ఎఫ్ పేరుతో రిలీజ్ చేసింది. కాగా ఈ బైక్ లో అత్యాధునిక ఫీచర్లు బైక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. డుకాటీ మూన్ స్టార్ బైక్ లా కనిపించే ఈ రేసర్ బైక్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ఈ ఈ రేసర్ బైక్ బెస్టియల్ ఈ కు చెందిన నాలుగో వెర్షన్ గా కంపెనీ పేర్కొంటుంది. స్టీమ్ లైన్ డిజైన్ తో రెండు సైడ్ స్పాయిలర్లతో వస్తుంది.

అలాగే బెస్టియల్ ఈ 2023 వెర్షన్ లో ట్యాంక్ మరింత కాంపాక్ట్ లుక్ తో వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే టెయిల్ యూనిట్ పూర్తి కార్బన్ వస్తుందని తెలిపారు. బ్రేంబో స్ట్రైల్మా శ్రేణి బ్రేకింగ్ సిస్టమ్. వెనుక మోనోషాక్ ఉంబ్రియా కెనటిక్స్ ఎయిర్ టెండర్ బ్రేక్ తో వస్తుంది. ఈ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల రైడింగ్ చేసే సమయంలో మరింత నియంత్రణ, స్థిరత్వాన్ని అందిస్తుంది. అలాగే ఈ బైక్ లో ఆడియో ఫోర్స్ బ్యాక్ సిస్టమ్ ను కొత్తగా ప్రవేశపెట్టారు. ఇలా చేయడం ద్వారా సాధారణ బండిలానే దీని ఇంజిన్ సౌండ్ వస్తుంది. అలాగే కఠినమైన రహదారి ఉపరితలాలపై సూపర్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. దీని వల్ల డ్రైవ్ చేసే సమయంలో ఇతరులకు బండి వచ్చే సౌండ్ వస్తుంది. ఈ బైక్ ధర విషయాలను మాత్రం ఇంకా కంపెనీ వెల్లడించలేదు.