Site icon HashtagU Telugu

Aadhaar: ఆధార్ కార్డు విషయంలో చేయాల్సినవి చేయకూడని పనులు గురించి మీకు తెలుసా?

Mixcollage 05 Feb 2024 02 55 Pm 8046

Mixcollage 05 Feb 2024 02 55 Pm 8046

ఈ రోజుల్లో ఆధార్ కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోవడంతో చాలామంది నేరగాళ్ళు, మోసగాళ్లు ఆధార్ కార్డు ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ ద్వారా వ్యక్తిగత సమాచారాలు సేకరించి బెదిరింపులకు నేరాలకు పాల్పడుతున్నారు. దాంతో ఎప్పటికప్పుడు అధికారులు కూడా విషయాలు షేర్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే ఉన్నారు. ఇకపోతే ఆధార్ కార్డు ఈరోజుల్లో చాలా వాటికి ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది.
దేశవ్యాప్తంగా ప్రజల గుర్తింపును వెరిఫై చేసేందుకు ఆధార్‌ ప్రామాణికంగా పని చేస్తుంది. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానికలి, ఆఫ్‌లైన్‌లో ఆధార్‌ నంబర్‌ చూసి అథెంటికేషన్‌ పూర్తి చేయవచ్చు.

అయితే ప్రజలు తమ ఆధార్ నంబర్‌ను ఇస్తున్నప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆధార్ అనేది 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య, దీన్ని ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందజేస్తుంది. అయితే ప్రజలు ఆధార్‌ వివరాలు అందించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆధార్ నంబర్‌లను సేకరించే సంస్థలు తప్పనిసరిగా సమాచారాన్ని సురక్షితంగా, చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా నిర్వహించాలని, నిల్వ చేయాలని ఆధార్ చట్టం, నిబంధనలు కూడా నిర్దేశిస్తున్నాయి. ఇతరులకు ఆధార్‌ షేర్‌ చేసే ముందు చేయాల్సిన పనులు.. ఆధార్ మీ డిజిటల్ గుర్తింపు. మీ గుర్తింపును నిరూపించుకోవడానికి దీన్ని నమ్మకంగా ఉపయోగించాలి.

ఏదైనా సంస్థతో మీ ఆధార్‌ను షేర్ చేస్తున్నప్పుడు, దాని విశ్వసనీయత గురించి తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. ఆధార్‌ను కోరే సంస్థలు తప్పనిసరిగా మీ సమ్మతిని పొందాలి. అది ఏ ప్రయోజనం కోసం తీసుకుంటున్నారో పేర్కొనాలి. మీ ఆధార్ నంబర్‌ను షేర్ చేయడానికి ఇష్టపడనప్పుడు, అథెంటికేషన్‌ కోసం వర్చువల్ ఐడెంటిఫైయర్ ని జనరేట్‌ చేయడండి. దీన్ని రోజూ మార్చుకోవచ్చు. UIDAI వెబ్‌సైట్ లేదా m-Aadhaar యాప్‌లో గత ఆరు నెలలుగా మీ ఆధార్ అథెంటికేషన్‌ హిస్టరీని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. మీ ఇమెయిల్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయండి. దీంతో ఆధార్‌ ఉపయోగించిన ప్రతిసారీ ఇమెయిల్ ద్వారా అథెంటికేషన్‌ సమాచారాన్ని స్వీకరించవచ్చు. OTP ఆధారిత ఆధార్ అధెంటికేషన్‌ సేవలను పొందేందుకు మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేయాలి. UIDAI ఆధార్ లాకింగ్, బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. మీరు ఆధార్‌ను ఉపయోగించని సమయంలో, ఈ ఫీచర్‌ ద్వారా ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయవచ్చు. అప్పుడు ఆధార్‌ బయోమెట్రిక్‌ లను ఎవరూ ఉపయోగించలేరు. మీకు అవసరమైన అన్‌లాక్‌ చేసుకుంటే, వివరాలు సురక్షితంగా ఉంటాయి.

మీ ఆధార్‌ను ఎవరైనా అనధికారికంగా ఉపయోగించినట్లు భావిస్తే లేదా ఆధార్‌కు సంబంధించి ఇతర సందేహాలు ఉంటే, 24*7 అందుబాటులో ఉన్న టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 1947కి కాల్ చేసి UIDAIని సంప్రదించండి లేదా help@uidai.gov.in కి ఇమెయిల్ చేయాలి.మీ m-Aadhaar PINని గోప్యంగా ఉంచాలి. దానిని ఎవరితోనూ షేర్ చేయకండి. ఆధార్ లెటర్, PVC కార్డు లేదా కాపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా వదిలివేయవద్దు. మీ ఆధార్ ఓటీపీ ని ఏ అనధికార సంస్థకు ఎప్పుడూ వెల్లడించవద్దు. సోషల్ మీడియా లేదా ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆధార్‌ను షేర్‌ చేయడం మానుకోవడం మీకే మంచిది.

Exit mobile version