CIBIL SCORE : సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి క్రెడిట్(రుణ) చరిత్రను ఆధారంగా లోన్లు మంజూరు చేయడంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కీలకంగా పరిగణించే మూడు అంకెల సంఖ్య (300-900).ఈ స్కోర్ లేకపోతే లేదా తక్కువగా ఉంటే, బ్యాంకులు రుణాలను తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రుణగ్రహీత చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే, రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లు కూడా వారికి వర్తిస్తాయి. అయితే, సిబిల్ స్కోర్ లేని వారికి రుణం పొందడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం కాదు.
Gold in India : ఇండియా ఒక బంగారు గని.. ఎన్ని నిల్వలు ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇతర మార్గాలు..
సిబిల్ స్కోర్ లేని వ్యక్తులు రుణం పొందడానికి, సెక్యూర్డ్ లోన్లు (బంగారం లేదా ఆస్తిపై రుణాలు) ఒక ఎంపిక. బ్యాంకులు స్థిరమైన ఆదాయ వనరు, ఉద్యోగ స్థిరత్వం,ఇతర ఆర్థిక వివరాలను కూడా పరిశీలిస్తాయి. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు తీసుకోవడం ద్వారా క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవచ్చు, ఇది సిబిల్ స్కోర్‌ను క్రమంగా మెరుగుపరుస్తుంది. చిన్న పర్సనల్ లోన్లు లేదా గోల్డ్ లోన్లు తీసుకొని సకాలంలో చెల్లింపులు చేయడం కూడా స్కోర్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియమాల ప్రకారం..క్రెడిట్ బ్యూరోలు (సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్ వంటివి) వ్యక్తుల ఆర్థిక చరిత్రను నిర్వహిస్తాయి. బ్యాంకులు ఈ స్కోర్‌ను ఉపయోగించి రుణ ఆమోద ప్రక్రియను నిర్ణయిస్తాయి. RBI సిబిల్ స్కోర్‌కు నిర్దిష్ట థ్రెష్‌హోల్డ్‌ను సెట్ చేయలేదు. కానీ, 750+ స్కోర్‌ను సాధారణంగా బ్యాంకులు మంచిగా పరిగణిస్తాయి. స్కోర్ 550 కంటే తక్కువ ఉంటే, రుణం పొందడం కష్టమవుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు.
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు (NBFCs) సాధారణంగా 650-700 పైన సిబిల్ స్కోర్‌తో రుణాలు మంజూరు చేస్తాయి.కానీ, కొన్ని సంస్థలు తక్కువ స్కోర్‌తో కూడా రుణాలు ఇస్తాయి. అయితే, వడ్డీ రేట్లు ఎక్కువగా (12%-24% వరకు) ఉంటాయి. ఉదాహరణకు, IIFL ఫైనాన్స్ వంటి సంస్థలు తక్కువ డాక్యుమెంటేషన్‌తో రూ.5లక్షల వరకు పర్సనల్ లోన్లను అందిస్తాయి. కానీ స్కోర్ ఆధారంగా అధిక వడ్డీ రేటును చార్చ్ చేయొచ్చు.
మంచి సిబిల్ స్కోర్ పొందడానికి EMIలు సకాలంలో చెల్లించడం, క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి క్లియర్ చేయడం, బహుళ రుణ దరఖాస్తులను ఒకేసారి చేయకపోవడం ముఖ్యం. క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, లోపాలను సరిచేయడం కూడా స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. ఈ చర్యలు రుణాలు మంజూరు చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయి. తక్కువ వడ్డీ రేట్లను పొందేందుకు సహాయపడతాయి.