Spy Cameras : సీసీటీవీ కెమెరాల వాడకం వల్ల పెద్దగా ఆందోళన పడాల్సిన విషయమేం లేదు. వాటి వల్ల సెక్యూరిటీ మరింత పెరిగింది. అసలు సమస్యల్లా సీక్రెట్ కెమెరాలు, స్పై కెమెరాలతోనే వచ్చింది. వీటి వల్ల ఇతరుల ప్రైవసీకి విఘాతం కలుగుతుంది.ఇల్లు, ఆఫీసుల్లో ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు పెట్టి ఉంటే ఎలా ? వాటిని ఎలా గుర్తించాలి ? అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. వీటికి టెక్ నిపుణులు ఇస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి..
We’re now on WhatsApp. Click to Join.
సీక్రెట్ కెమెరాలు ఉండని చోటు అంటూ లేనే లేదు. వాటిని గోడ గడియారాలు, పవర్ బ్యాంక్‌లు, పిక్చర్ ఫ్రేమ్, వాల్ అవుట్లెట్లు, అలారం గడియారాలు, USB డ్రైవ్‌లు, పెన్నులు, ఫొటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్స్, అద్దాలు, బొమ్మలు, మొక్కల కుండీలు, అలంకరణ వస్తువులలో కూడా అమరుస్తుంటారు. పెద్ద వాల్ క్లాక్‌లలో రహస్య కెమెరాలను ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతమున్న టెక్నాలజీతో ఇలాంటి స్పైై కెమెరాలను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ఎఫ్ డిటెక్టర్లు, కెమెరా లెన్స్ డిటెక్టర్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు, వైఫై స్కానర్ల సాయంతో స్పై కెమెరాల ఆచూకీని దొరకబట్టొచ్చు. వాస్తవానికి పైన మనం చెప్పుకున్న వస్తువుల్లో అమర్చే కెమెరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే గుర్తు పట్టేయొచ్చు.
- స్పై కెమెరాల నుంచి తరచుగా వెలువడే రేడియో తరంగాలను గ్రహించడం ద్వారా RF టిటెక్టర్ వాటిని గుర్తిస్తుంది. చాలా కెమెరాలు 500MHz నుంచి 6GHz వరకు రేడియో తరంగాలను విడుదల చేస్తుంటాయి.
- రేడియో సిగ్నల్స్ రిలీజ్ చేయని స్పై కెమెరాలు తమ ఫీడ్‌ను ఎస్డీ కార్డ్స్ లాంటి లోకల్ స్టోరేజ్‌లో దాచిపెడతాయి. ఇలాంటి కెమెరాలను కెమెరా లెన్స్ డిటెక్టర్లతో ఐడెంటిఫై చేయొచ్చు. కెమెరా లెన్స్‌లు కాంతి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తాయి. ఇలా చేస్తున్న క్రమంలో సెన్సార్ ఆఫ్ అయితే ఆ ఏరియాలో స్పై కెమెరాలు ఉన్నట్లు లెక్క.
- కెమెరాలు కంటిన్యూగా పనిచేస్తే వేడెక్కుతాయి. ఆ వేడి ఆధారంగా వాటిని గుర్తించేందుకు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను వాడొచ్చు.
- ఫోన్లోని ఫ్రంట్ కెమెరాను ఆన్‌చేసి గది మొత్తాన్ని చూడండి. కంటికి కనిపించని, ఏదైనా వెలుగు ఫోన్ కెమెరాలో కనిపిస్తే.. అదే హిడెన్ కెమెరా అని ఐడెంటిఫై చేయండి.
- వై-ఫైతో రన్ అవుతున్న రహస్య కెమెరాలను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. హ్యాండ్‌హెల్డ్ వైఫై, నెట్‌వర్క్ స్కానర్‌ల ద్వారా వాటి జాడను ఐడెంటిఫై చేయొచ్చు.