Site icon HashtagU Telugu

Earthquake Alerts : మీ ఫోన్‌కు భూకంపాల అలర్ట్స్ రావాలా ? ఈ సెట్టింగ్స్ చేసుకోండి

Earthquake Alerts Smart Phones Android Users Iphone Users

Earthquake Alerts : గత మూడు నెలల వ్యవధిలో భూకంపాలు బాగా పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా.. తమిళనాడు నుంచి బిహార్ దాకా భూప్రకంపనలను జనం ఫీలయ్యారు. భూమి కంపించిందని గుర్తించగానే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూప్రకంపనలు వచ్చినప్పుడు వెంటనే మనకు స్మార్ట్ ఫోనులో అలర్ట్ వచ్చేలా చేసుకోవచ్చు.  ఇందుకోసం ఫోనులో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి ? ఎలాంటి సమాచారం మన ఫోనుకు అందుతుంది ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :ACB Raids : ఫార్ములా-ఈ రేస్ కేసు.. గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్.. కేటీఆర్ అరెస్ట్ ఆ తర్వాతే ?

స్మార్ట్‌ఫోనే సమస్తం అనేలా ప్రపంచం మారింది. ఇప్పుడు పర్సు లేని జేబులు(Earthquake Alerts) కనిపిస్తున్నాయి కానీ.. ఫోన్ లేని చెయ్యి కనిపించడం లేదు. మరుగుదొడ్లు లేని ఇళ్లలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీన్ని మనం అడ్వాంటేజీగా మార్చుకోవాలి. భూకంపాలు వచ్చినప్పుడు మనం ప్రాణాలను రక్షించుకోవాలి అంటే దానిపై సమాచారం ముందే అందాలి. ఆ విధమైన అలర్ట్‌ను మన  స్మార్ట్‌ఫోన్‌‌కు పంపే సెట్టింగ్స్ గురించి అందరం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ సెట్టింగ్స్ ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్లలో ఒకలా, ఐఫోన్లలో మరోలా ఉంటాయి.

Also Read :High Court BIG Shock to KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత

ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఇలా

మనలో చాలామంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లనే వాడుతుంటారు. వాటిలో యాక్సిలరో మీటర్లు అమర్చి ఉంటాయి. అవి భూకంపాన్ని, భూ ప్రకంపనలను ముందుగానే గుర్తించగలవు. సెంట్రల్ సర్వర్ ద్వారా భూకంప సంకేతాలను మన ఫోనులోని యాక్సిలరో  మీటర్లు ప్రాసెస్ చేస్తాయి. వెంటనే భూకంప ప్రభావిత ప్రాంతంలోని వినియోగదారులకు అవి అలర్ట్‌ను పంపుతాయి. దీనివల్ల చాలావరకు ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులోని సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి.. అక్కడ ఉండే సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ (Safety and Emergency) విభాగానికి నావిగేట్ చేయాలి. అందులో ఎర్త్ క్వేక్ అలర్ట్స్ (Earthquake Alerts) అనే టోగుల్‌ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. మనం ఉన్న ఏరియాలో భూకంపాలు వస్తే వెంటనే ఫోనుకు అలర్ట్స్ వస్తాయి.

Also Read :Nara Lokesh : పదవుల పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఐఫోన్‌లో సెట్టింగ్స్ ఇలా 

ఐఫోనులో కూడా మనం తొలుత సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లాలి. అందులో ‘నోటిఫికేషన్స్’ అనే సెక్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే  ఎమర్జెన్సీ అలర్ట్స్ (Emergency Alerts) అనే టోగుల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తే సరిపోతుంది.

MyShake యాప్ 

భూకంపానికి సంబంధించిన అలర్ట్స్ కోసం MyShake అనే యాప్‌ను కూడా మనం వాడొచ్చు.