Computer: కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే ఈ ఫొటో గుర్తుందా..? దీని వెనుక ఉన్న చరిత్ర ఇదే..

ప్రపంచంలో రోజు ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే బయటపడుతూ ఉంటాయి. ఎన్నో ఆసక్తికర పరిణామాలు,

  • Written By:
  • Publish Date - April 11, 2023 / 10:43 PM IST

Computer: ప్రపంచంలో రోజు ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే బయటపడుతూ ఉంటాయి. ఎన్నో ఆసక్తికర పరిణామాలు, అద్బుతాలు ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన ఫొటోగా విండోస్ స్క్రీన్‌పై ఎక్కవగా కనిపించే ఈ ఫొటో నిలిచింది.

కంప్యూటర్ వాడే ప్రతిఒక్కరికీ ఓ ఫొటో గుర్తు ఉండి ఉంటుంది. విడోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో డిఫాల్ట్‌గా కంప్యూటర్ స్క్రీన్‌పై ఓ ఫొటో వస్తుంది. అందులో పచ్చిక బయలు, నీలిరంగు ఆకాశంలో తెల్ల పరిచిన మేఘాలు ఉంటాయి. చూడగానే ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలామంది ఈ ఫొటోను కంప్యూటర్ స్క్రీన్‌పై వాల్ పేపర్ గా పెట్టుకుంటారు. అయితే ఫొటో వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందట. 1996లో చార్లెస్ ఓ రియల్ అనే వ్యక్తి ఈ ఫొటో తీశాడు. 2000లో ఈ ఫొటో హక్కుల్ని మైక్రో‌సాఫ్ట్ సొంతం చేసుకుంది. చార్లెస్ మారిన 20 సంవత్సరాల క్రితం తన భార్య డాఘ్నే లార్కిన్‌తో కలిసి కౌంటీకి వెళ్లినప్పుడు ఈ ఫొటో తీశాడట.

తన భార్యతో కలిసి మళ్లీ అక్కడికి వెళ్లినప్పుడు అప్పటి ఫోటో ప్రేమ్‌ను తీసుకెళ్లాడు. విండో ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫార్ట్ గా కనిపించే ఈ ఫొటోను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది చూశారు. దీంతో ఈ ఫొటో గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ వాడే ప్రతిఒక్కరికీ ఈ ఫొటో ఫేవరెట్ గా మారింది. ఈ ఫొటోను ప్రతిఒక్కరూ స్క్రీన్ ‌పై ఉంచుతారు. ఇప్పటికీ ఈ ఫొటో చాలామంది కంప్యూటర్ స్క్రీన్లపై కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు అయితా ఆ ఫొటోకు ఇప్పటికీ క్రేజ్ అలాగే ఉంది. ఒక్క ఫొటోకు ఎంత క్రేజ్ ఉంటుందో దీనిని బట్టి తెలుస్తుంది.