ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ (Youtube) అనేది వినోద వేదిక మాత్రమే కాదు, కెరీర్‌ను నిర్మించుకోవడానికి, బ్రాండ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్‌గా మారింది. రోజుకు లక్షల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నా, వాటిలో కొన్నే వైరల్ అవుతాయి. దీనికి కారణం కంటెంట్‌తో పాటు వీడియో అప్‌లోడ్ చేసే సమయం కూడా కీలక పాత్ర పోషించడమే. మీరు వేగంగా ఎదగాలంటే, వీడియోను ఎప్పుడుపోస్ట్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.
Renigunta Airport : రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు పెట్టాలని ప్రతిపాదన
ప్రపంచవ్యాప్తంగా డేటా నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వీడియో అప్‌లోడ్‌కు ఉత్తమ సమయం వారాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య మరియు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు. వీక్‌డేస్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య విండో అత్యుత్తమం. ఈ సమయంలో ప్రజలు స్కూల్, ఆఫీసు ముగిశాక ఎక్కువగా యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. మొబైల్ వినియోగం అధికంగా ఉండటంతో, లంచ్ టైమ్ (1–2PM), ట్రావెల్ టైమ్ (5–7PM) వంటి గ్యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు.
Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే
వీడియో వైరల్ కావాలంటే కేవలం సమయం కాదు, థంబ్‌నెయిల్, టైటిల్ ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోను ముందుగా షెడ్యూల్ చేయడం వల్ల నిర్ణీత సమయానికి పోస్ట్ చేయడం సులభం. అప్‌లోడ్ అయిన తర్వాత మొదటి గంటలో మీరు కామెంట్లు, షేర్లు చేయడం ద్వారా ఎంగేజ్‌మెంట్‌ను పెంచండి. మీరు వీడియోని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వల్ల మరిన్ని వ్యూస్ పొందొచ్చు. మీ ఛానెల్‌లోని యూజర్ యాక్టివిటీని యూట్యూబ్ విశ్లేషణల ద్వారా గుర్తించండి. అందుకు అనుగుణంగా అప్‌లోడ్ టైమ్‌ను నిర్ణయించుకోవడం సక్సెస్‌కు మొదటి మెట్టు. సో మీరు ఇవన్నీ పాటిస్తే మీ వీడియోస్ కు తిరుగుండదు.