Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ లో 65536 ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

15012023 Whatsapplimit I

15012023 Whatsapplimit I

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది యూజర్ల అవసరాలను గుర్తించుకొని, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తోంది. వాట్సాప్ అప్ డేట్ ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎండ్-టు-ఎండ్ ఎన్ స్క్రిప్షన్ కారణంగా వాట్సాప్ మెసేజ్ లను వేరే వ్యక్తులు హ్యాక్ చేయడం లేదంటే చదవడం కుదరదు అనే నమ్మకాన్ని వాట్సాప్ కల్పిస్తోంది.

ఫేస్ బుక్ వాట్సాప్ ను భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేయగా.. వాట్సాప్ లోని చాలా ఫీచర్లు ఎక్కువ మందికి తెలియవు. వాట్సాప్ లో 65536కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది కేవలం నెంబర్ అని అనుకుంటే పొరపాటే. వాట్సాప్ లో మనం కొన్ని అక్షరాలను పంపడానికి అనుమతిని కలిగి ఉంటాం. మనం వాట్సాప్ నుండి ఏదైనా టెక్ట్స్ ని పంపించేటప్పుడు అది ఒకవేళ 65536 అక్షరాల కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు ఓ పాపప్ మెసేజ్ వస్తుంది.

మీరు పంపించే మెసేజ్ లో 65535 అక్షరాలు మాత్రమే పంపబడతాయి అని వస్తుంది. కాబట్టి 65536 కన్నా ఎక్కువ అక్షరాలను పంపడానికి వీలుపడదు. అలాగే మనం ఒకేసారి 30 ఫోటోలు లేదంటే వీడియోలను పంపడానికి మాత్రమే వాట్సాప్ అనుమతినిస్తుంది. అంతకు మించి పంపాలనుకుంటే మరోసారి ఫోటోలు లేదంటే వీడియోలను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.

డాక్యుమెంట్ల విషయానికి వస్తే గతంలో 100ఎంబీ సైజ్ కలిగిన డాక్యుమెంట్లను షేర్ చేయడానికి వాట్సాప్ అనుమతించేది. కానీ కొత్త అప్ డేట్ ప్రకారం 2జీబీ సైజ్ వరకు ఉన్న డాక్యుమెంట్లను పంపడానికి వీలవుతుంది. అటు వీడియో ఫైల్స్ ని 16ఎంబీ కంటే ఎక్కువ సైజ్ వరకు మాత్రం పంపించగలం. వాట్సాప్ లోని కెమెరా ఆప్షన్ ద్వారా తీసిన వీడియోని అయినా సరే 16ఎంబీ వరకు మాత్రమే పంపగలం.

Exit mobile version