WhatsApp Secret Features: బాబోయ్.. వాట్సాప్ లో ఇన్ని రకాల సీక్రెట్ ఫీచర్స్ ఉన్నాయా?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోయింది. దీంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 07:00 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోయింది. దీంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంది అంటే కచ్చితంగా అందులో వాట్సాప్ కచ్చితంగా ఉండే ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లోనూ ఈ వాట్సాప్ కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ నిత్యం ఎన్నో రకాల ఫీచర్లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది. మరి ఇప్పటి వరకు వాట్సాప్ తీసుకువచ్చిన ఆ సీక్రెట్ ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని కొన్ని సార్లు మనం గ్రూపులో ఎవరైనా మెసేజ్ చేస్తే వారికి పర్సనల్గా రిప్లై ఇవ్వాలని అనుకుంటాం.

అటువంటప్పుడు గ్రూప్లో అవతలి వ్యక్తి పెట్టిన మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేస్తే రిప్లై ప్రైవేట్ లి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ విధంగా మనం గ్రూపులో మెసేజ్ చేసిన వ్యక్తికి పర్సనల్ గా మెసేజ్ చేయవచ్చు. మన ఇతరులకు మెసేజ్ చేసేటప్పుడు చాట్ చేసే ఓపిక లేనప్పుడు వాయిస్ మెసేజ్ పంపుతూ ఉంటాం. అప్పుడు మైక్ మీద హోల్డ్ చేసి పట్టుకొని వాయిస్ మెసేజ్ చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం చెప్పడం పూర్తవ్వకుండానే సెండ్ అవడం లేదు డిలీట్ అవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడే వారికి వాట్సాప్​లో ఒక ఆప్షన్ ఉంది. మైక్​ ఐకాన్​ను హోల్డ్ చేసి పైకి స్వైప్​ చేస్తే మనం బటన్​ను పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సినంత సేపు వాయిస్​ రికార్డు చేసుకోవచ్చు. మధ్యలో రికార్డింగ్​ను ఆపి వాయిస్​ ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. మనం రికార్డు చేసిన దానిని డిలీట్​ కూడా చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.

అలాగే మనం ఎప్పుడైనా మెసేజ్ చేసేటప్పుడు దానిలో కొన్ని ముఖ్యమైన పదాలు ఉంటాయి. వాటిని హైలెట్ చేయాలి అనుకుంటే పదం లేదా వాక్యానికి రెండు చివరలలో స్టార్ * పెడితే అది బోల్డ్ అయ్యి హైలెట్‌గా కనిపిస్తుంది. అలాగే పదాలను ఇటాలిక్​గా పెట్టాలనుకుంటే వాక్యాల చివరన అండర్​స్కోర్ _ పెడితే చాలు. అలాగే టెక్ట్స్​ను స్ట్రైక్‌త్రూ చేయాలనుకుంటే ఇరువైపులా టిల్డెస్ ~ గుర్తును పెడితే కోరుకున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మనం కొన్నిసార్లు బిజీగా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి పంపిన మెసేజ్లకు మనం రిప్లై ఇవ్వలేకపోతుంటాం. అటువంటి అప్పుడు చాట్ ను అన్ రీడ్ చేయాలి. అందుకోసం ఏం చేయాలంటే టెక్ట్స్​ను హోల్డ్​డౌన్​ చేస్తే కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేస్తే అన్​రీడ్ చాట్​ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే అవతలి వ్యక్తికి మనం ఇంకా చాట్​​ చదవనట్లు చూపిస్తుంది.

అలాగే మన ఇతరులకు మెసేజ్ పెట్టి ఎంత సమయమైంది ఎదుటివారు ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు ఎప్పుడు చదివారు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదెలా అంటే మనం పెట్టిన ఏదైనా మెసేజ్​ను హోల్డ్ చేస్తే కుడివైపున మూడు చుక్కలు కనిపిస్తాయి. అక్కడ ఇన్​ఫో అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద నొక్కితే మెసేజ్ టైమింగ్స్ అంతా కనిపిస్తుంది. అలాగే ఇతరులు మనకు పంపించినా లేదా మనం ఇతరులకు పంపించిన వాయిస్ మెసేజ్ ని స్పీడ్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ వినవచ్చు. ఇందుకోసం వాయిస్ మెసేజ్ ప్లే సింబల్​కు ఎడమవైపున 1x స్పీడ్ కనిపిస్తుంది. దాని మీద మళ్లీ క్లిక్ చేస్తే 1.5x కనిపిస్తుంది. ఇలా మనకు కావాల్సిన వేగంలో వాయిస్ మెసేజ్​ను వినవచ్చు.