Tech Tricks : ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్ లు పంపించవచ్చు…ఎలాగో తెలుసా..?

ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్...ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 08:03 PM IST

ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్…ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. లక్షలాది మంది వినియోగదారులతో ప్రజాదరణ పొందిన ఈ యాప్..ఇప్పటికే మెసేజింగ్, కాలింగ్, వీడియో కాలింగ్, నగదు చెల్లింపులతోపాటు మరెన్నో ఫీచర్లను అందిస్తోంది. అయితే ప్రస్తుతం యూజర్లు కోరకునే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మీరు మీ మొబైల్లో నెంబర్ సేవ్ చేసుకోని నెంబర్స్ కూడా మెసేజ్ లు పంపించడం ఈ ఫీచర్లలో ఒకటి. సేవ్ చేయని ఫోన్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ లను పంపించడం సాధ్యం కాదు. కాబట్టి మీరు వాట్సాప్ లో ఎవరితోనైనా చాట్ చేయాలనుకుంటే…ముందుగా మీరు వారి నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెసేజ్ చేసేందుకు యాప్ ఒపెన్ చేయాలి. కానీ మీకు పరిచయం లేని వ్యక్తికి మెసేజ్ పంపించాలనుకుంటే …ఎలా పంపించాలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఫాలో అవ్వండి.

ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా వెబ్ బ్రౌజర్ ద్వారా మెసేజ్ పంపించడం..!!
1.ముందుగా మీరు మీ ఫోన్ లో ఏదైనా వెబ్ బ్రౌజర్ ను తెరవండి.
2. ఇప్పుడు “http://wa.me/91xxxxxxxxx”లింక్ ను టైప్ చేసి ఎంటర్ నొక్కిండి
( ‘XXXXX’లో ఫోన్ నెంబర్ టైప్ చేయండి)
3. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లింక్ ను ఒపెన్ చేసేందుకు ఎంటర్ నొక్కండి.
4. ఇప్పుడు మీరు వాట్సాప్ స్కీన్ లోకి వెళ్తారు. కంటిన్యూ చాట్ ఆప్షన్ తో కనిపించే గ్రీన్ బటన్ పై క్లిక్ చేయండి.
5. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ వాట్సాప్ చాట్ విండో లో ఒపెన్ అవుతుంది. ఇప్పుడు వారికి మెసేజ్ చేయండి.

ట్రూకాలర్ ఉపయోగించి ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయడం..

1. మీరు ట్రూకాలర్ ఉపయోగిస్తే..కాంటాక్ట్ నెంబర్ ను సేవ చేయకుండానే డైరెక్టుగా మెసేజ్ ను పంపించడం ఈ యాప్ సులభం చేస్తుంది.
2. ముందుగా ట్రూకాలర్ యాప్ ఓపెన్ చేయండి
3. ఇప్పుడు సెర్చ్ బార్ లో మీర చాట్ చేయాలనుకుంటున్న వారి ఫోన్ నెంబర్ టైప్ చేయండి.
4. మీకు కావాల్సిన వారి ట్రూకాలర్ ప్రొఫైల్ ఒపెన్ అవుతుంది.
5. కిందికి స్క్రోల్ చేయండి. ప్రొఫైల్లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బటన్ పై నొక్కండి.
6. ఇలా చేస్తే వాట్సాప్ చాట్ విండో ఒపెన్ అవుతుంది.
7. మీరు కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపిచవచ్చు.

Siri షార్ట్‌కట్‌ల ద్వారా ఫోన్ నంబర్‌లను సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపించడం (iPhone మాత్రమే)
1. ఐఫోన్ వినియోగదారుల కోసం, వాట్సాప్‌లో సేవ్ చేయని కాంటాక్ట్‌కి మెసేజ్ పంపించగల మరో ట్రిక్ ఉంది.
2. మీ iPhoneలో Apple షార్ట్‌కట్‌ల యాప్‌ను ఒపెన్ చేయండి.
3. “సత్వరమార్గాన్ని జోడించు” బటన్‌పై నొక్కండి.
4. నాన్-కాంటాక్ట్ షార్ట్‌కట్‌కు వాట్సాప్ ను ఇన్‌స్టాల్ చేయండి.
5. సత్వరమార్గాన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఒకే బటన్ పై నొక్కండి.
6. రిసీవర్ ను ఎంచుకోండి అనే పాప్ అప్ కనిపిస్తుంది.
7. దేశం కోడ్‌తో పాటు ఫోన్ నంబర్‌ను టైప్ చేయండి.
8. వాట్సాప్ చాట్ ఒపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సినవారికి మెసేజ్ చేయవచ్చు.