Site icon HashtagU Telugu

Whatsapp – Email Link : వాట్సాప్‌తో ‘ఈమెయిల్’ లింక్ ఇలా చేసేయండి..

Whatsapp Email Link

Whatsapp Email Link

Whatsapp – Email Link : ఇప్పుడు వాట్సాప్ వాడని వారంటూ ఎవరూ లేరు. కొత్తకొత్తగా వస్తున్న వాట్సాప్ ఫీచర్లను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త ఫీచర్లతో కలుగుతున్న సౌలభ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈతరుణంలో వాట్సాప్ యూజర్స్ అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక లేటెస్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఈమెయిల్ లింక్ ఇలా.. 

వాట్సాప్ అకౌంట్‌ను ఈమెయిల్‌తో లింక్ చేసే ఫీచర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ వాట్సాప్‌తో ఈమెయిల్‌ను ఎలా లింక్ చేయాలి ? అనే డౌట్ చాలామందికి ఉంది. ఈ ప్రాసెస్ చాలా ఈజీ!! తొలుత వాట్సాప్‌ను ఓపెన్ చేయండి. కుడి వైపున టాప్ కార్నర్లో త్రీ లైన్ డాట్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అందులో అకౌంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఆపై ‘యాడ్ ఈమెయిల్ అడ్రస్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో ఈమెయిల్ వివరాలను నమోదు చేయాలి. ఆ వెంటనే వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్‌ మీ ఈమెయిల్ ఐడీకి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ మీ వాట్సాప్ అకౌంటుతో లింక్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను మార్చాలని భావిస్తే.. మరోసారి ‘ఛేంజ్ ఈమెయిల్ అడ్రస్’ ఆప్షన్‌ను క్లిక్ చేసి వివరాలను మార్చేయాలి. మీరు ఈమెయిల్‌తో వాట్సాప్ వెరిఫికేషన్ చేసినా.. ఫోన్ నంబర్ వెరిఫికేషన్ కూడా యథావిధిగా కొనసాగుతుంది.

Also Read: Hi Nanna Trailer : కన్నీరు పెట్టిస్తున్న ‘హాయ్ నాన్న’..

వెంటనే టెస్ట్ చేయండి.. 

తొలి విడతగా ఈ ఫీచర్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతోంది. త్వరలో దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు కూడా పొందుతారు. ఒకవేళ బీటా వెర్షన్లో దీన్ని వాడాలని భావిస్తే.. గూగుల్ ప్లేస్టోర్‌‌లో వాట్సాప్ లిస్టింగ్ ఆప్షన్‌ను టైప్ చేయాలి. అనంతరం జాయిన్ బీటా వెర్షన్‌పై క్లిక్ చేయండి. యూజర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ప్లే స్టో్ర్‌లో ‘బీటా ప్రోగ్రామ్ ఫుల్’ అనే టెక్ట్స్‌ను మీకు చూపిస్తుంది.

ప్రయోజనం ఇదీ.. 

కొన్నిసార్లు వాట్సాప్‌లోకి లాగిన్ అయ్యే సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు 6 అంకెల ఓటీపీ రావడంలో చాలా ఆలస్యం అవుతుంటుంది. అలాంటి సమయంలో ఏదైనా టెక్నికల్ సమస్య ఉంటే యూజర్లు లాగిన్ కాలేరు. అందుకే ఈమెయిల్‌‌ను కూడా వాట్సాప్‌‌కు లింక్ చేసుకోవడం బెటర్. ఓటీపీ మెసెజ్ ఫోన్‌కు రానప్పుడు.. ఈమెయిల్ ద్వారా దాన్ని పొందొచ్చు. ఫలితంగా వాట్సాప్ అకౌంట్‌లోకి ఈజీగా లాగిన్(Whatsapp – Email Link) కావచ్చు.

Exit mobile version