Site icon HashtagU Telugu

Iphone 14: ఐఫోన్ 14 సిరీస్ భారీ ఆఫర్ కేవలం రూ. 50 వేలకే.. ధర, ఫీచర్స్ ఇవే?

Iphone 14

Iphone 14

దేశవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో ఆయా కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించడం కోసం అనేక రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఈ నేపథంలోనే యాపిల్ సంస్థ ఐఫన్ లపై భారీగా డిస్కౌంట్ ఇస్తూ వరుసగా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. యాపిల్ సంస్థ ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. దీపావళి సేల్స్ సమయంలో కూడా డిస్కౌంట్ ఇవ్వడం ప్రస్తుతం ఐఫోన్ 14 పై భారీగా డిస్కౌంట్ ను ఇస్తోంది. ఈ ఐఫోన్ 14 సిరీస్ ఇటీవలే లాంచ్ అయిన విషయం తెలిసిందే.

కాగా మార్కెట్ లోకి విడుదల అయిన కొద్ది నెలలకే తగ్గింపు ధరకు లభించడం విశేషం. తాజాగా ఐఫోన్‌ 14ను రూ. 51,900 కంటే తక్కువ ధరకు పొందేలా ఆఫర్ ను ఇచ్చింది యాపిల్ సంస్థ. కాగా ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 79,900. ఐఫోన్ 14, 128జీబీ మోడ‌ల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ .77,400కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 5000 తగ్గింపు అదనంగా పొందవచ్చు. అదేవిధంగా పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌ పై యూజ‌ర్లు రూ.20,500 వ‌ర‌కూ త‌గ్గింపు పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్ డీల్‌తో లేటెస్ట్ యాపిల్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ. 51,900కు అందుబాటులో ఉంటుంది. అనగా రూ. 20,500 ఎక్స్ఛేంజ్ విలువ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్‌ 12 Pro ద్వారా రూ. 20వేలు, ఐఫోన్‌ 11 ధరపై రూ. 15వేలు తగ్గింపు పొందవచ్చు. కాగా తాజాగా ఐఫోన్ 11 సిరీస్ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించిన యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ 14 సిరీస్ మళ్లీ ఆఫర్ ను ప్రకటించడంతో ఐఫోన్ వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయడం కోసం బార్లు తీరుతున్నారు.