WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక..మీరు వాడే వాట్సాప్ నకిలీదీ కూడా కావచ్చు?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ యాప్ వాట్సాప్ లో తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామందికి

  • Written By:
  • Publish Date - October 12, 2022 / 06:15 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ యాప్ వాట్సాప్ లో తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామందికి ప్రతిరోజు ఒక్కసారైనా వాట్సాప్ ను చూడకపోతే నిద్ర పట్టని వారు కూడా ఉన్నారు అంటే వాట్సాప్ కు ఏ రేంజ్ లో అలవాటు పడిపోయారో అర్థం చేసుకోవచ్చు. దొరికింది అంతే చాలు చాలామంది ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ లో కూడా అనేక రకాల వాట్సాప్ లో వచ్చాయి.

అందులో ముఖ్యంగా జీబీ వాట్సాప్ అనే యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే సేమ్ ఇలాంటిదే ఒకటి నకిలీ వాట్సాప్ వచ్చింది అని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది ఈఎస్టిఈ. జీబీ వాట్సాప్ అనే ఒక వాట్సాప్ క్లోన్ యాప్ భారతదేశంలోని వినియోగదారులపై గూడచర్యం చేస్తున్నట్టుగా తాజాగా ఈఎస్ టీఈ వెల్లడించింది. ఇది ఈ జీబీ వాట్సాప్ అన్నది గూగుల్ ప్లే స్టోర్ లో లేకపోయినప్పటికీ వివిధ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది అని తెలిపారు. సాధారణ వాట్సాప్ మాదిరిగానే ఇందులో కూడా అన్ని రకాల ఫీచర్లు ఉంటాయని, కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. కాగా ఈ జీబీ వాట్సాప్ మాల్వేర్ ఫైళ్ళతో ఫోన్ మీద నిగా పెడుతున్నట్లు ఒక హెచ్చరించింది.

అయితే నిగా పెట్టినట్లు మనకు తెలియదని ఈ ఎస్ టి ఈ తెలిపింది. ఆ నకిలీ జీబీ వాట్సాప్ నెమ్మదిగా మన రోజువారి ఫోన్ వ్యవహారాలను గమనిస్తూ వస్తుందని తెలిపింది ఈ ఎస్ టిఈ. ఇటువంటి అన్ సపోర్టెడ్ యాప్ లను వాడే వారి ఖాతాలపై వాట్సాప్ సంస్థ ఇప్పటికే తాత్కాలికంగా నిషేధాన్ని విధించింది. దీన్ని తొలగించిన తర్వాత కూడా అలాగే వాడితే వారికి శాశ్వతంగా వాట్సాప్ వాడకుండా ఉండేలా నిషేధించనుంది. అయితే ఈ క్లోన్ వాట్సాప్ కేసులు ఎక్కువగా భారత్తో పాటు ఈజిప్ట్, బ్రెజిల్,పెరు లో వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు. అటువంటి నకిలీ వాట్సాప్ లో బారిన పడకుండా ఉండడం కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు.