Site icon HashtagU Telugu

DIZO Watch: డీజో నుంచి మార్కెట్లోకి రెండు సరికొత్త స్మార్ట్ వాచ్ లు.. ధర, ఫీచర్స్ ఇవే?

Dizo Watch

Dizo Watch

భారత మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ వాచ్ లు విడుదలైన విషయం తెలిసిందే. సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరకే ఇప్పటికే పలు రకాలు కంపెనీలు స్మార్ట్ వాచ్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ గ్యాడ్జెట్‌ సంస్థ డిజో భారత్‌ లోకి రెండు సరి కొత్త స్మార్ట్‌ వాచ్‌లను విడుదల చేసింది. ఈ వాచ్లు రెండు వేరియంట్ లలో లభిస్తున్నాయి. అవి డిజో వాచ్‌ డీ ప్రో, డిజో వాచ్‌ డీ అల్ట్రా పేర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది డిజో సంస్థ. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ లు వాటి ఫీచర్లు ధర విషయానికి వస్తే..

ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ స్క్రీన్‌ను అందించారు. 110 స్పోర్ట్స్‌ మోడల్స్‌కు ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 150 కి పైగా వాచ్‌ ఫేస్‌లను అందించనున్నారు. ఇక ఈ డిజో వాచ్‌ డి ప్రోలో కెమెరా కంట్రోల్‌, షటర్‌ బటన్‌, అలారం, బ్లూటూత్‌ కాలింగ్‌తో పాటు డు నాట్‌ డిస్ట్రబ్‌ మోడ్‌ వంటి ఫీచర్ లను కూడా అందించారు. కాగా ఈ స్మార్ట్‌ వాచ్‌ మనకు బ్లాక్‌, సిల్వర్‌, గ్రే, లైటింగ్‌ బ్లూ వంటి నాలుగు కలర్స్‌ లో లభించనుంది. ఇకపోతే డిజో వాచ్‌ డి అల్ట్రా ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.78 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ డిస్‌ప్లేను అందించారు. 270 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ వాచ్‌ సొంతం.

స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం 2.5డీ కర్వ్‌డ్‌ టాంపర్డ్‌ గ్లాస్‌ను ఇచ్చారు. 100కిపైగా స్పోర్ట్స్‌ మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఫోన్‌ కెమెరా కంట్రోల్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌, అలారం ఫైండ్‌ మొబైల్‌, ఫైండ్‌ వాచ్‌, మెసేజింగ్‌ నోటిఫికేషన్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే.. డిజో డీ అల్ట్రా స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 3,299 కాగా, డిజో డీ ప్రో స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 2699గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిజో డీ అల్ట్రా వాచ్‌ జనవరి 12వ తేదీ నుంచి, డిజో వాచ్‌ డి ప్రో జనవరి 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.