ప్రస్తుతం దీపావళి సేల్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ రానున్న సందర్భంగా ఇప్పటికే ఆన్లైన్ లో అలాగే ఆఫ్లైన్లో దీపావళి సేల్స్ మొదలయ్యాయి. అందులో భాగంగానే రకరకాల వస్తువులపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి ఆయా కంపెనీలు. ఆ ఆఫర్లో భాగంగానే ఏకంగా రూ.1,50,000 విలువ చేసే స్మార్ట్ ఫోన్ ని కేవలం 49 వేలకే అందిస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆ ఫోన్ మరేదో కాదు శాంసంగ్ గాలాక్సీ ఎస్ 23.
ఈ ఫోన్ ధర రూ. 89,999 అయితే మీరు అమెజాన్‌లో 52 శాతం తగ్గింపుతో కేవలం రూ. 42,998 కే కొనుగోలు చేయవచ్చు. అదనంగా ప్లాట్‌ఫారమ్ మీకు రూ. 25,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లను అందిస్తుంది. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో మీరు ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చన్నమాట. మీరు మొత్తం నగదును ఒకేసారి చెల్లించకూడదు అనుకుంటే, మీరు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఈ శాంసంగ్ గాలాక్సీ ఎస్ 23 అల్ట్రా 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,999 గా ఉంది.
ఈ సమయంలో మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు అమెజాన్ నుండి 50 శాతం తగ్గింపుతో కేవలం రూ.74,999కి కొనుగోలు చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్ రూ. 25,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లను కూడా అందిస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.49,299కి కొనుగోలు చేయవచ్చు. మీరు దీన్ని EMIలో కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేసి చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోండి.