Diwali Messges Scam: దీపావళి పేరుతో చైనీస్ వెబ్ సైట్ల స్కామ్.. తస్మాత్ జాగ్రత్త?

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 06:00 PM IST

సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు అమాయకమైన ప్రజలను మోసం చేద్దామా అని కాచుకొని ఉంటారు. చిన్న అవకాశం దొరికిన అమాయక ప్రజలను బురిడీ కొట్టించి మోసపూరితమైన కాల్స్ మెసేజ్లతో వారిని ట్రాప్ చేసి వారి దగ్గర ఉన్న డబ్బులు వారి డేటా మొత్తం కలెక్ట్ చేస్తూ వారిని మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలామంది సైబర్ నెరవేల చేతిలో మోసపోయాము అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఉంటారు. ఇలా ఉంటే పెట్టడం భారతదేశంలో దీపావళి పండుగ సంబరాలు మొదలైన విషయం తెలిసిందే.

ఈ దీపావళి పండుగను అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు దీపావళి మెసేజెస్ గిఫ్ట్ స్కామ్స్ అంటూ అమాయక ప్రజలకు బురిడీ కొట్టించే పనిలో పడ్డారు. వెబ్ సైట్స్ ఫ్రీ దివాలి గిఫ్ట్ పేరుతో లింక్స్ ను సెండ్ చేసి యూజర్ల వివరాలను కాజేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తెలిపింది. దీపావళి పండుగ పేరుతో జరుగుతున్న ఆన్లైన్ స్కాముల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఒక అడ్వైజర్ ని జారీ చేసింది. అంతేకాకుండా అటువంటి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా కొన్ని జాగ్రత్తలను తెలిపింది.

వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ లాంటి విభిన్నమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ఫేక్ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. నీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో వచ్చే లింక్ పై క్లిక్ చేస్తే ఇట్లు ప్రైజులు గెలుచుకోవచ్చు అంటూ మోసపూరిత మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా సైబర్ నేరస్తులు మహిళలను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్ టెలిగ్రామ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లోకి మెసేజ్లు పంపుతున్నారు. అయితే వాటిని గుర్తించడం ఎలా అంటే ఆ వెబ్సైట్లో చివరి నా చైనీస్ డొమైన్ ఎక్స్ టెన్షన్ అయిన .cn అని ఉంటుందట. అలాగే .xyz, .top డొమైన్ ఎక్స్టెన్షన్ ఉన్న వెబ్సైట్లను కూడా ఇటువంటి ఫేక్ మెసేజ్లను పంపుతున్నట్టు తెలిపింది. అయితే ఆంటీ ఫేక్ మెసేజ్లను నమ్మి ఆ లింకులపై క్లిక్ చేయొద్దు అని చెబుతున్నారు. లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వాళ్లు అడిగిన సమాచారాలను నమోదు చేయొద్దని, అలా నమోదు చేయడం వల్ల సైబర్ నేరస్తులు బ్యాంకింగ్ వివరాలను సేకరించి డబ్బులను కాల్ చేస్తున్నట్టు వెల్లడించింది.