ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్‌లు ఉంటున్నాయి. కొన్ని పెద్ద పెద్ద ఫ్యామిలీలలో అయితే ప్రతి ఒక మనిషి తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే మార్కెట్లోకి ఎన్ని రకాల ఫోన్లు విడుదల అయినా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కంపెనీ యాపిల్. ఒక్కసారైనా ఐఫోన్ వినియోగించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధరల కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు.
అటువంటి వారి కోసం యాపిల్ సంస్థ ఎప్పటికప్పుడు అందుబాటు ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడంతో పాటుగా భారీ డిస్కౌంట్ లను కూడా అందిస్తూ ఉంటుంది. తాజాగా కూడా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కొన్ని ఐ ఫోన్స్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ అని అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 15, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ లను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు అందిస్తున్నారు. ఈ సేల్‌లో ఐఫోన్ 15 రూ. 68,999 నుంచి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు రిటైల్ ధర రూ. 79,900గా ఉంటే ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.10,901 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది.
అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ. 2,500 తగ్గింపు ఉంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ రూ.74,999 వద్దకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. రూ. 89,900గా ఉండగా రూ. 14,901 తగ్గింపుతో తక్కువ ధరకే ఈ ఫోన్ ని అందిస్తున్నారు. అలాగే ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14 ప్లస్ రూ.56,999 కే అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ అసలు ధర రూ. 79,999గా ఉంది. సాధారణంగా ఐ ఫోన్ ప్రో వెర్షన్ల ధరలు రూ.లక్షకు దగ్గరగా ఉంటాయి. అయితే ఈ సేల్‌లో ఆ ధరలు బాగా తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 15 ప్రో మోడల్ రూ. 1,24,990 కే అందిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ. 1,34,990గా ఉంది. అంతే కాకుండా పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసే వారికి ప్రత్యేక ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్ 13 రూ. 52,999 అందుబాటులో ఉండగా ఐఫోన్ 12 రూ.39,999కే మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఐఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు.