Tech News : మీ స్మార్ట్‌ఫోన్ గురించి ఈ నిజం తెలుస్తే…ముట్టడానికే జంకుతారు..!!

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వ్యక్తి లేడు. స్మార్ట్ ఫోన్ లేనిది ఏ పని కూడా చేయరు. మనలో అంతలా పాతుకుపోయింది

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 12:44 PM IST

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వ్యక్తి లేడు. స్మార్ట్ ఫోన్ లేనిది ఏ పని కూడా చేయరు. మనలో అంతలా పాతుకుపోయింది ఈ స్మార్ట్ ఫోన్. అయితే మీరు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే ఒక విషయం గమనించారా? స్మార్ట్ ఫోన్ పై ఎన్ని బ్యాక్టిరాయాలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని నివేదికల ప్రకారం టాయిలెట్ సీటు కంటే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పైన్నే ఎక్కువగా బ్యాక్టీరియాలు ఉంటాయని తేలింది. అవును నిజమే. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

భోజనం చేస్తున్నా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే…పడుకున్నప్పుడు పక్కకు ఫోన్ ఉండాల్సిందే. ప్రతి పనిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కొంతమంది టాయిలెట్ వెళ్లిన వెంట స్మార్ట్ ఫోన్ తీసుకెళ్తుంటారు. కొన్ని విషయాలతో మినహాయిస్తే…అన్నింటిలోనూ మీతోపాటే మీ ఫోన్ ఉంటుంది. మన లైఫ్ స్టైయిల్లో అంతగా పాతుకుపోయింది స్మార్ట్ ఫోన్. మొత్తంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ మన శరీరంలో ఒక భాగం. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత ప్రమాదమో మీరు ఆలోచించారా? తెలుసు అంటారా..? అయితే ఫోన్ శుభ్రత గురించి ఎంత మందికి తెలుసు. మీ ఫోన్ స్క్రీన్ పై ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయి.?ఇది మీరు ఊహించి ఉండరు.

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టాయిలెట్ సీటు కంటే మురికిగా ఉంటుంది
మీ స్మార్ట్ ఫోన్ సూక్ష్మీక్రిములకు సంతానోత్పత్తి ప్రదేశం. ఇంకో విషయం ఏంటంటే బ్యాక్టీరియాతో ఉన్న మీ స్మార్ట్ ఫోన్ ముఖానికి దగ్గరగా ఎంత ప్రమాదమో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన శాస్త్రవేత్తలు స్మార్ట్ ఫోన్లు సాధారణ టాయిలెట్ సీటు కంటే 10 రెట్లు మురికిగా ఉంటుందని కనుగొన్నారు. పిల్లలు ఫోన్ వాడినట్లయితే వారి ఫోన్ స్క్రీన్ పై సగటున 17,000బ్యాక్టీరియా ఉంటుందని మరొక అధ్యయనం కనుగొన్నది.

ఏం చేయాలి?
మీరు స్మార్ట్ ఫోన్ను నోటికి, ముఖానికి దగ్గరగా తీసుకున్నప్పుడు ఆలోచించండి. దానిపై ఉన్న బ్యాక్టీరియా మనలో ఎంత హాని కలిగిస్తోందనని. స్మార్ట్ ఫోన్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఈ ఫోన్ను శుభ్రం చేసేందుకు మార్కెట్లో ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో ఎఫ్పటికప్పుడు ఫోన్ను క్లీన్ చేస్తుండాలి. మార్కెట్లో లభించే uvలైట్ ప్రొడక్టులు స్మార్ట్ ఫోన్ పై ఉండే బ్యాక్టీరియాను చంపుతాయి.