Site icon HashtagU Telugu

Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు?

Special Offer

Air India Flight

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఫ్లైట్లు రద్దు అవడం లేదంటే ఎమర్జెన్సీ గా ల్యాండింగ్ చేయడం ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని కొన్ని సార్లు సాంకేతిక లోపాల వల్ల అభిమానులను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా మరికొన్నిసార్లు వాతావరణ పెతుకుల పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ చేయాల్సి వస్తోంది. దాంతో ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్లాల్సిన ఫ్లైట్లు రద్దు అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని సమయాలలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం తాజాగా సోమవారం ఆలస్యం కావడంతో చెన్నై విమానాశ్రయంలో దాదాపుగా 150 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆ విమానం ఈరోజు ఉదయం 10 గంటలకు చెన్నై నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ విమానం కోసం ప్రయాణికులు విమానాశ్రయంలోని బోర్డింగ్ గేట్ వద్ద వేచి ఉన్నారు. కానీ ఆ విమానం ఆలస్యంపై ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు.

విమానం ఎందుకు ఆలస్యం అయ్యింది అన్న విషయంపై తమకు ఎటువంటి సమాచారం అందించలేదు అని ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విమానయాన సంస్థ తమకు ప్రత్యామ్నాయ విమానాలను కూడా అందించలేదు అని వారు వాపోయారు. అచ్చం ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికులు ఆదివారం జైపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని జైపూర్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.