Site icon HashtagU Telugu

Pan Card: పాన్‌ కార్డు హోల్డర్స్ కి అలర్ట్.. డిసెంబర్‌ 31 ఆ పని పూర్తి చేసుకునే అవకాశం!

PAN Card

PAN Card

పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుసార్లు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకుగాను గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరైనా ఆధార్‌,పాన్‌ లింక్‌ చేసుకోకపోతే జరిమానాతో లింక్‌ చేసుకునే అవకాశం ఉందట. అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే డిసెంబర్‌ 31వ తేదీలోపు పాన్‌ కార్డులను ఆధార్ కార్డులతో కచ్చితంగా లింక్‌ చేసుకోవాలని తేల్చి చెప్పారు అధికారులు.

లింక్‌ చేయని పాన్‌ కార్డులు డిసెంబర్ 31వ తేదీ తర్వాత డీయాక్టివేట్‌ అవుతాయని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త పాన్‌ కార్డ్ తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులోనూ పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. కొన్ని సంస్థలు కస్టమర్ల అనుమతి లేకుండా వారి ప్రొఫైల్‌ లను రూపొందించడానికి పాన్‌ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి ఆర్థిక నేరాలకు దారి తీస్తున్న నేపథ్యంలోనే ఆధార్‌ తో లింక్ చేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. పాన్‌ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా డిసెంబర్‌ 31లోపు పాన్‌ కార్డు, ఆధార్‌ లింక్ చేయకపోతే పాన్‌ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. తదుపరి లావాదేవీలు జరగవు. అలాగే కార్డును మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. కాబట్టి వెంటనే అనగా డిసెంబర్ 31 లోపు మీ ఆధార్ కార్డు పాన్ కార్డుకు లింక్ చేసుకోవడం మంచిది.