Aadhaar Free Update: ఆధార్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు!

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు ఉండడం అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 03:30 PM IST

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు ఉండడం అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతే కాకుండా ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రతి ఒక విషయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్ కార్డు విషయంలో ఏవైనా తప్పులు ఉంటే అప్డేట్ చేసుకోవడం కూడా తప్పనిసరి. ఆధార్ బ్యాంకు అకౌంట్‌ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఇలా ఒక్కటేమిటి అన్నింటికి ఆధార్‌ కావాల్సిందే. గతంలో ఆధార్‌ కార్డు ఉన్నవారు పది సంవత్సరాల తర్వాత తమ బయోమెట్రిక్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. కానీ తాజాగా మరోసారి ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది యూఐడీఏఐ. దీంతో వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14 వరకూ ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో గడువు పొడిగించాలని నిర్ణయించామని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించి ఆధార్ పత్రాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌ కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేళ్లుపూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్‌సైట్‌ లో అప్‌డేట్ చేసుకోవాలని గతంలో యూఐడీఏఐ సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేళ్లకు ఒకసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటర్ లోని వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియతో దేశ ప్రజల వ్యక్తిగత సమాచారం ఎప్పటికప్పుడు సీఐడీఆర్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం నిక్షిప్తమవుతుందని యూఐడీఏఐ తెలిపింది. అయితే ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాల్సిన వారు.. ఉడాయ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలు సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డ్, ఓటరు కార్డు, కిసాన్ ఫోటో,పాస్‌బుక్, చిరునామా పత్రాలు తదితర డాక్యుమెంట్లను గుర్తింపు పత్రాలు వాడవచ్చు. విద్యార్థులైతే వారి విద్యా సంస్థ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, మార్క్ షీట్, పాన్/ ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగ పడతాయని పేర్కొంది. అలాగే మూడు నెలల్లోపు చెల్లించిన విద్యుత్, వాటర్, గ్యాస్, టెలిఫోన్ బిల్లుల రశీదులు కూడా అడ్రస్ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించవచ్చునని యూఐడీఏఐ పేర్కొంది.