Whatsapp: వాట్సాప్ లో తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్స్.. లిఫ్ట్ చేసారంటే అంతే సంగతులు?

అమాయకమైన ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలని ఉంచుకుంటూనే ఉన్నారు. నిత్యం సైబర్ నేరగాళ్ల చేతిలో పదుల స

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 04:14 PM IST

అమాయకమైన ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలని ఉంచుకుంటూనే ఉన్నారు. నిత్యం సైబర్ నేరగాళ్ల చేతిలో పదుల సంఖ్యలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా అలాంటి మోసమే ఒకటి వెలుగులోకి రావడంతో వాట్సాప్ వినియోగదారులందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సైబర్ నేరగాళ్లు ఈసారి జనాలను మోసం చేయడం కోసం వాట్సాప్ ను వారధిగా వాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో చాలామందికి తెలియని నెంబర్లను నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

అది కూడా ఇతర దేశాలకు చెందిన కోర్సుతో రావడంతో చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. +82, +62, +72 లాంటి అన్నోన్ నెంబర్లతో ఫోన్ కాల్స్ రావడంతో వెంటనే కొందరు పోలీసులను ఆశ్రయించారు. వాయిస్‌ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి ఫోన్‌ వస్తున్నట్లు భ్రమ కలిగిస్తున్నారు. ఇలా ఫోన్‌ కాల్స్‌ చేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పని ఉందంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. కేవలం వెబ్‌సైట్స్‌ క్లిక్‌ చేస్తే డబ్బులు వస్తాయంటూ ఆశ చూపుతూ యూజర్ లను నిండా ముంచేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది యూజర్లు తమకు ఇలాంటి అన్ నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా స్క్రీన్ షాట్స్ ఫొటోస్ తీసి షేర్ చేస్తున్నారు. అయితే ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను లిఫ్ట్‌ చేయకూడదు. పొరపాటున లిఫ్ట్ చేసారంటే ఇక అంతే సంగతులు. ఎవరైనా మోసం చేస్తున్నట్లు ఏమాత్రం అనిపించినా వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.