Loan Apps: 221 యాప్స్ ను వెంటనే తొలగించాలి.. గూగుల్ కు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ!

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 11:00 AM IST

రోజు రోజుకి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ మారేకొద్దీ మనుషులు మోస పోవడమే కాకుండా బద్ధకస్తులు కూడా అవుతున్నారు. అయితే ఒకప్పుడు అప్పుడు కావాలి అంటే తెలిసిన వాళ్ళను అడిగేవారు. లేదంటే వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను లేదంటే విలువైన ఆస్తి పత్రాలను బ్యాంకుల్లో కుదువబెట్టి లోన్ తీసుకునే వారు. ఇకపోతే ప్రస్తుతం ఇది పూర్తిగా డెవలప్ కావడంతో అన్ని సౌకర్యాలతో పాటు అప్పుడు కూడా క్షణాల్లో పుడుతుంది. అయితే అప్పు కావాలి అన్నప్పుడు తక్షణమే ఇవ్వడానికి నెట్ లో కొన్ని వందల వేల సంఖ్యలో లోని ఆప్స్ ఉన్నాయి.

ఆ లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా ఫోన్ కి అప్లై చేసుకుంటే క్షనాల్లో డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. బ్యాంకులకు వెళ్లి అక్కడ నిలబడి అప్పు తీసుకునే వారి సంఖ్య అంటే యాప్స్ ద్వారా అప్పు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా చాలా మంది చిన్నచిన్న అవసరాలకోసం అప్పుగా తీసుకుంటున్నారు. అయితే అటువంటి వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. తీసుకున్న అప్పులు చెల్లించకపోతే వెంటనే బెదిరింపులకు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

అలాగే లోన్ తీసుకునే సమయంలో ఇచ్చే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యాప్ ద్వారా మొబైల్ లోకి చొరబడి అసలు, వడ్డీ చెల్లించని వారి బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు తీసుకున్న మహిళల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వారి పరువు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. రోజు రోజుకి అటువంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపుల కారణంగా పలువురు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు వాళ్లు అడిగినంత ఇస్తున్నారు. ఇంకొందరు మాత్రం ధైర్యం చేసి అటువంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి యాప్స్ పై పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు లోన్ యాప్స్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. అమాయకులను మోసం చేసి, వేధిస్తున్న 221 లోన్ యాప్ లను గుర్తించారు. వాటిని తొలగించాలని గూగుల్ కు లేఖ రాశారు. ఇలాంటి లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.