Smart Phones: రూ.8 వేల లోపు లభిస్తున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్స్.. అవేంటంటే?

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు కూడా మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నాయి. అయితే వినియోగదారులు ఎక్కువగా ఎక్కువ ఫీచర్లు తక్కువ ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్ లను బాగా ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా బ్యాటరీ కెమెరాలు బాగా ఉన్న స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇకపోతే తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి రూ.8 వేల లోపే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మోటో ఈ13.. ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,999 గా ఉంది. ఈ ఫోన్ నిక్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో యూనిసోక్ టీ 606 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ03.. ఈ స్మార్ట్‌ ఫోన్ ధర రూ. 7,950 గా ఉంది. దీన్ని అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో లభించనుంది. ఇందులో కూడా యూనిసోక్ టైగర్ టీ 606 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది.

టెక్నో స్పార్క్ 9.. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజితో లభించనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,999 గా ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ 37 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12పై పని చేస్తుంది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

రెడ్‌మి10ఏ.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,999 గా ఉంది. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మంచి మంచి ఫీచర్లతో అతి తక్కువ ధరకే అందుబాటులో లభించనుంది.

రియల్‌మి నార్జో 50ఐ ప్రైమ్.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,999 గా ఉంది. ఇది 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ తో లభించనుంది. ఇందులో యూనిసోక్ టీ 612 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 8 ఎంపీ కెమెరా ఉంటుంది. 6.5 ఇంచుల డిస్‌ప్లే ఉంది.