Coca-Cola Branded Smartphone: కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్.. రియల్ మీ సంస్థతో భాగస్వామ్యం..?

కోకాకోలా (Coca-Cola) డ్రింక్ పేరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి కోకాకోలా ఫోన్ (Coca-Cola Smartphone) కూడా రాబోతోంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కోకాకోలా ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. కోకా-కోలా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారతదేశంలో తన ఫోన్ ను ప్రారంభించబోతుంది.

Published By: HashtagU Telugu Desk
COCA COLA

Resizeimagesize (1280 X 720) 11zon

కోకాకోలా (Coca-Cola) డ్రింక్ పేరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి కోకాకోలా ఫోన్ (Coca-Cola Smartphone) కూడా రాబోతోంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కోకాకోలా ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. కోకా-కోలా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారతదేశంలో తన ఫోన్ ను ప్రారంభించబోతుంది. దీని కోసం కోకా-కోలా ఓ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భాగస్వామ్యం ఏ మొబైల్ బ్రాండ్‌తో ఉంటుందో సమాచారం లేదు.

నివేదిక ప్రకారం..కోకాకోలా ఫోన్ పేరుతో Realme 10 4G పరిచయం చేయబడుతుంది. ఈ ఫోన్ ఫీచర్లు Realme ఫోన్ మాదిరిగానే ఉంటాయి. Realme 10 4G వంటి MediaTek Helio G99 ప్రాసెసర్‌తో కూడిన గ్రాఫిక్స్ కోసం Coca-Cola ఫోన్ ARM G57 MC2 GPUని పొందుతుంది. ఇది కాకుండా 6.4-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్ ప్లేతో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ విషయంపై కోకాకోలా కంపెనీ ఆధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. శీతల పానీయాల సంస్థలు స్మార్ట్ ఫోన్ తీసుకురావడం ఇదే ప్రథమం కాదు. కోకాకోలా ప్రత్యర్థి పెప్సీ పీ1 పేరిట గతంలోనే ఫోన్ తీసుకువచ్చింది. షెంజెన్ కూబే అనే సంస్థతో చేయి కలిపి పీ1 ఫోన్ కు రూపకల్పన చేసింది. అయితే కొన్నాళ్లతో ఈ ఫోన్ తయారీని పెప్సీ నిలిపివేసింది.

Also Read: iVOOMi Scooter: మార్కెట్ లోకి ఇవూమి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

Realme 10 4G ఫీచర్లు

Coca-Cola ఫోన్ Realme 4G ఫోన్ రీ-బ్రాండెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. ఈ సందర్భంగా దీని ఫీచర్లు కూడా Realme ఫోన్ మాదిరిగానే ఉండనున్నాయి. Realme ఫోన్ 6.4-అంగుళాల పూర్తి HD + AMOLED డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz. కెమెరా గురించి మాట్లాడితే.. Realme 10 4G LED లైట్‌తో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

  Last Updated: 27 Jan 2023, 07:08 AM IST