Site icon HashtagU Telugu

Speaker Volume: మీ ఫోన్ స్పీకర్ వ్యాల్యూమ్ తగ్గిపోయిందా.. సర్వీస్ సెంటర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే సరి చేసుకోండిలా?

Mixcollage 18 Dec 2023 08 51 Pm 2528

Mixcollage 18 Dec 2023 08 51 Pm 2528

మామూలుగా స్మార్ట్ ఫోన్ ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఫోన్ స్పీకర్ వాల్యూమ్ కొన్నిసార్లు తగ్గడం ప్రారంభమవుతుంది. ఎవరైనా పిలిస్తే వినడం కష్టం అవుతుంది. ఈ సమస్యలు వచ్చిన ప్రతిసారి ఎక్కువగా సర్వీసింగ్ సెంటర్లకు వెళుతూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక మీదట ఆ ఇబ్బంది అక్కర్లేదు. ఇకమీదట సెల్ ఫోన్ సర్వీసింగ్ సెంటర్ లకు వెళ్ళకుండానే మీ ఇంట్లోనే ఉండి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ ఫోన్ నుండి అస్సలు శబ్దం రాకపోతే ముందుగా అది ఏదైనా బ్లూటూత్ పరికరానికి కనెక్ట్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. అలా చేయకపోతే స్పీకర్ నుండి వచ్చే సౌండ్ చాలా తక్కువగా ఉంటే స్పీకర్‌లో మురికి పేరుకుపోయి ఉండవచ్చు. కాబట్టి ముందుగా మీ స్పీకర్‌లో పేరుకుపోయిన దుమ్ము చెత్తను శుభ్రం చేయడం మంచిది. ఫోన్‌ని అన్‌లాక్ చేసి, వాల్యూమ్ అప్ బటన్‌ను నొక్కాలి. ఇక్కడ నుండి వాల్యూమ్ పూర్తయి, వాల్యూమ్ పెరగకపోతే మీరు సెట్టింగ్స్ కి వెళ్లాలి. దీని తర్వాత మీరు ఇక్కడ అదనపు వాల్యూమ్ సెట్టింగ్ ఎంపిక చేయాలి ఇక్కడ మీరు సౌండ్, నోటిఫికేషన్‌లు లేదా సౌండ్ వైబ్రేషన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మీ ఫోన్ వేరే పేరుతో ఈ ఎంపికను కలిగి ఉండవచ్చు. మీరు ఇక్కడ వాల్యూమ్‌పై నొక్కితే, స్లయిడ్ బార్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి వాల్యూమ్ పెంచండి. ఇక్కడ మీరు రింగ్‌టోన్‌లు, మీడియా, అలారాలు, నోటిఫికేషన్‌ల కోసం బార్‌లను చూడవచ్చు. వీటన్నింటినీ ఎంచుకున్న తర్వాత మీ ఫోన్ స్పీకర్ వాల్యూమ్ అలాగే ఉంటే మీరు వాల్యూమ్ యాప్‌ను విడిగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్లే స్టోర్‌లో వాల్యూమ్ బూస్టర్ కోసం శోధించినప్పుడు అక్కడ మీకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి. ప్రత్యేక యాప్‌ని ఉపయోగించి స్పీకర్ వాల్యూమ్‌ను పెంచవచ్చు.