Alert :ఫేక్ ఆఫర్లతో చైనా హ్యాకర్లు…భారతీయులే టార్గెట్..!! హెచ్చరిస్తోన్నసైబర్ సెక్యూరిటీ ..!!

భారత్ లో ఇప్పుడంతా పండగల సీజన్ నడుస్తోంది. దేవినవరాత్రులు ముగిసాయి. దీపావళి రాబోతోంది. ఈ తరుణంలో చాలా చోట్ల వినియోగదారులను ఆకట్టుకునేందుకు సేల్ షురూ అయ్యింది.

  • Written By:
  • Updated On - October 20, 2022 / 12:00 PM IST

భారత్ లో ఇప్పుడంతా పండగల సీజన్ నడుస్తోంది. దేవినవరాత్రులు ముగిసాయి. దీపావళి రాబోతోంది. ఈ తరుణంలో చాలా చోట్ల వినియోగదారులను ఆకట్టుకునేందుకు సేల్ షురూ అయ్యింది. దీంతోపాటు స్కామర్లు కూడా యాక్టివ్ అయ్యారు. చైనీస్ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలంటూ CERT-In హెచ్చరించింది. భారతీయులే టార్గెట్ గా ఫేక్ ఆఫర్లు, విక్రయాల పేరుతో హ్యాకర్లు యాక్టివ్ గా మారారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. చైనీస్ డొమైన్ లతో కూడిన వెబ్ సైట్ల ద్వారా వినియోగదారుల డేటా దొలగించబడుతుందని అలర్ట్ చేసింది.

CERT-అలర్ట్‌లో ఏముంది.
భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారులు ఫ్రీగిఫ్ట్స్ , ఆఫర్స్ ట్రాప్ లో పడవద్దంటూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సలహా ఇచ్చింది. బ్రాండ్ పేరుతో కస్టమర్లను మోసం చేసే సందర్బాలు చాలా ఉన్నాయి. దీంతో కస్టమర్లు బాధితులుగా మారుతున్నారు. పెద్ద బ్రాండ్ తోకనిపించే చాలా సైట్లు వినియోగదారుల ను హ్యాక్ చేసేందుకు క్రియేట్ చేసినట్లు వెల్లడించింది. కస్టమర్లు ఇలాంటి వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

ఇలాంటి మోసాలు వాట్సాప్ లో చాలా షేర్ అవుతుంటాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా ఫేక్ అఫర్ల ద్వారా కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడతారు. వ్యక్తిగత సమాచారం అడుగుతారు. ఈ సమాచారాన్ని పొందిన తర్వాత…మీరు ఇతర ఫ్రెండ్స్ కు ఇన్ని గ్రూపులకు షేర్ చేయండి అని అడుగుతారు. ఈ విధంగా స్కామ్ వెబ్ సైట్ లింక్ చాలా మందికి చేరుతుంది. ఫ్రీగిప్టులనగానే అత్యాశతో వారి వివరాలన్నింటిని నమోదు చేస్తారు. కస్టమర్లకు సంబంధించిన డేటా మొత్తంకూడా హ్యాకర్ల చేతుల్లో పోతుంది.

ఇలాంటి మోసాలతో జాగ్రత్త
-మీకు ఏదైనా లింక్ వస్తే వాటిపై అస్సలు క్లిక్ చేయకండి
-ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా URLను చెక్ చేయండి.
-మెసేజ్ లు లేదా ఈమెయిల్స్ వచ్చిన ఫ్రీగిఫ్ట్ ఆపర్ల పేరుతో కనిపించే లింక్ పై క్లిక్ చేయకూడదు.
-తెలియని సైట్ లో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు నమోదు చేయకూడదు.
-తెలియన యాప్ స్టోర్ లేదా వెబ్ సైట్ నుంచి ఏ యాప్ ను డౌన్ లోడ్ చేయకూడదు.