Site icon HashtagU Telugu

Magnet Car: అయస్కాంత శక్తితో నడిచే కారు.. గంటకు 230కి.మీ వేగంతో?

Magnet Car

Magnet Car

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా టెక్నాలజీతో అటు ప్రపంచాన్ని అలాగే ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ వాటిలో సక్సెస్ను సాధిస్తూ టెక్నాలజీ విషయంలో ముందడుగుగా దూసుకుపోతోంది చైనా. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక వండర్ను కూడా క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యింది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఇంజన్ తో నడిచే కార్లు అలాగే ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన విషయం తెలిసిందే. వీటితో పాటుగా తాజాగా మరొక కొత్త కార్ ను కూడా మార్కెట్ లోకి విడుదల చేసింది చైనా సంస్థ.

అయితే ఈసారి ఏకంగా మ్యాగ్నెటిక్ కారుని తయారు చేసింది. తాజాగా ఈ మ్యాగ్నెటిక్ కారు టెస్ట్‌ డ్రైవ్‌ ను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. దానికి అధునాతన టెక్నాలజీ జోడించి ఆ కారు ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే చైనా గత ఏడాది విద్యుత్‌ అయస్కాంత శక్తితో నడిచే రైలును కనుగొన్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీని మాగ్లెవ్‌ అని పిలుస్తారు. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మాగ్లెవ్‌ ట్రైన్‌ భూమ్మీద ప్రయణించే అత్యంత వేగవంతమైన రైలు గా నిలిచింది. మాగ్నెటిక్ ట్రైన్ బుల్లెట్ రైలు కంటే మరింత వేగంగా దూసుకెళ్లగలదు. కాగా ప్రస్తుతం చైనా అదే టెక్నాలజీతో చైనా కారును సిద్ధం చేసింది. 2.8 టన్నుల బరువున్న ఈ కారు టెస్ట్‌ డ్రైవ్‌లో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

జియాంగ్‌ ప్రావిన్స్‌ హైవే పై ఈ డ్రైవ్‌ టెస్ట్ ను నిర్వహించారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర ఈ కారును టెస్ట్‌ చేశారు. అయితే ఈ కారు గ్రౌండ్‌ను టచ్‌ చేయకుండా ప్రయాణిస్తాయి. ఎందుకంటే ఇవి విద్యుత్‌ అయస్కాంత శక్తి ఆధారంగా నడుస్తాయి. ఇటీవల పరీక్షించిన మాగ్లెవ్ కారు కూడా గ్రౌండ్‌కు 35 మిల్లిమీటర్ల గ్యాప్‌తో ప్రయాణిస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో తయారు చేసిన వాహనాలకు సాధారణ రోడ్లపై ప్రయాణించలేవు. ప్రత్యేకంగా నిర్మించిన విద్యుత్‌ అయస్కాంత ట్రాక్లపై మాత్రమే నడుస్తాయి. ఇప్పుడు మాగ్లెవ్‌ కారుకి కూడా ఈ ఫార్ములానే అనుసరించాలి. లేదంటే ఈ కార్ల నిర్వహణ అంత తేలికైన పని కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. రోడ్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వీటిని తీసుకురావడానికి చైనా ఆలోచన చేస్తోందట.

Exit mobile version