Space: జీరో గ్రావిటీలో పునరుత్పత్తి అధ్యయనం.. స్పేస్ లోకి కోతులను పంపనున్న చైనా?

శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో రకాల విషయాలను కనుగొన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అంతరిక్షానికి

  • Written By:
  • Publish Date - November 7, 2022 / 06:25 PM IST

శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో రకాల విషయాలను కనుగొన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అంతరిక్షానికి సంబంధించిన అనేక విషయాలపై పరిశోధనలను జరుపుతూనే ఉన్నారు. కాగా అంతరిక్షంలో జీరో గ్రావిటీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా అన్న విషయంపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి అంతరిక్షంలోకి కోతులను పంపి ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది. చైనా రోదసిలో కొత్తగా నిర్మించిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో ఈ పరిశోధనలను నిర్వహించనున్నారు.

కాగా రోదసి లోకి కోతులను పంపించిన తరువాత ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వాటి పెరుగుదల ఎలా ఉంటుంది అన్న విషయాలపై పరిశోధనలు చేయనున్నారు. ప్రస్తుతం రోదసీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా అన్న విషయం పైనే ప్రధానంగా ఈ పరిశోధన జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఇప్పటికే రోదసీలో పలు జీవాలపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా భవిష్యత్తులో మనుషులు కూడా రోదసీలో కాపురం చేసే అవకాశం ఉందా అన్న విషయంపై పరిశోధనలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే చైనా శాస్త్రవేత్తలు రోదసిలోకి ఎలుకలను పంపించి అక్కడ పునరుత్పత్తి సాధ్యమా అన్న విషయం పై పరిశోధనలు జరిపిన విషయం తెలిసిందే. కాగా రష్యా , అమెరికా స్పేస్‌ స్టేషన్ లకు ధీటుగా తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ను చైనా తీర్చిదిద్దింది. మరి ఈ విషయంపై చైనా శాస్త్రవేత్తలు సక్సెస్ ను సాధిస్తారో లేదో చూడాలి మరి.