Site icon HashtagU Telugu

Worlds Fastest Internet : ప్రపంచంలోనే స్పీడ్ ఇంటర్నెట్ ఇక చైనాలో.. విశేషాలివీ

China Tech

China Tech

Worlds Fastest Internet : స్వదేశీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో, స్వదేశీ పరిశ్రమల వికాసంలో రాకెట్ వేగంతో చైనా దూసుకుపోతోంది. ప్రపంచంలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న దాని కంటే 10 రెట్లు ఎక్కువ వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం ప్రత్యేకమైన బ్యాక్ బోన్ (ల్యాన్) నెట్‌వర్క్‌ను చైనా ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన ఇంటర్నెట్ డేటా రూట్‌  చైనాలోని బీజింగ్, వూహాన్, గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్‌జౌ ప్రాంతాలలో సెకనుకు 1.2 టెరాబిట్‌ల (1,200 గిగాబిట్లు) అల్ట్రా హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను సప్లై చేయగలదు. ఈ ఇంటర్నెట్‌తో మనం ఒక సెకనులోనే 150 సినిమాలను ఇతరులకు సెండ్ చేయగలుగుతాం. దీన్నిబట్టి సెకనుకు 1.2 టెరాబిట్‌ల ఇంటర్నెట్ పవర్‌ను మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచం అంచనాలను తలకిందులు చేసి.. 

వాస్తవానికి ఇంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు 2025 నాటికి అందుబాటులోకి వస్తాయని ప్రపంచ టెలికాం పరిశ్రమ వర్గాలు భావించాయి. అయితే అంతకంటే రెండేళ్ల ముందే దీన్ని చైనా సుసాధ్యం చేసి చూపించింది.  ఈ వరల్డ్ స్పీడ్ ఇంటర్నెట్ సేవల కోసం బీజింగ్, వూహాన్, గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్‌జౌ ప్రాంతాల మధ్య దాదాపు 3,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్‌ను వేశారు. ఈ ఏడాది జులై నాటికే ఈ పనులన్నీ పూర్తయ్యాయి. చైనాలోని సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్‌ల సంయుక్త సహకారంతో ఈ ఘనతను చైనా సాధించగలిగింది.

We’re now on WhatsApp. Click to Join.

అమెరికా కంటే  చైనాలో.. 

ప్రస్తుతం అమెరికా వంటి దేశాలలో ఉన్న ఇంటర్నెట్ బ్యాక్‌బోన్ నెట్‌వర్క్‌లు(ల్యాన్‌లు) కూడా సెకనుకు కేవలం 100 గిగాబిట్ల వేగంతోనే ఇంటర్నెట్‌ను సప్లై చేయగలవు. ఈ ఏడాది అమెరికాలో ఐదోతరగతి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సెకనుకు 400 గిగాబిట్‌ల ఇంటర్నెట్ సప్లై జరుగుతోంది. ఇప్పుడు అమెరికాను దాటేసి చైనా ఇంటర్నెట్ ట్రాన్స్‌మిషన్‌లో కొత్త విప్లవానికి నాంది పలికింది. వాస్తవానికి  ఈ ఘనతను సాధించడం వెనుక పదేళ్ల శ్రమ ఉంది. చైనా ప్రభుత్వం ఫ్యూచర్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (FITI) పేరుతో పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టు వల్లే ప్రపంచంలోనే స్పీడెస్ట్ ఇంటర్నెట్ లైన్(Worlds Fastest Internet) రెడీ అయింది.

Also Read: Errabelli Dayakar Rao : పాలకుర్తిలో ఎర్రబెల్లి కష్టమేనా..?

Exit mobile version