Site icon HashtagU Telugu

PAN Card: చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డు ఉంటుందా.. దరఖాస్తు విధానం ఇదే?

Mixcollage 11 Jul 2024 10 06 Am 3267

Mixcollage 11 Jul 2024 10 06 Am 3267

ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. చాలా వాటికి పాన్ కార్డును ఆధారంగా అడుగుతున్నారు. పాన్ కార్డు ద్వారా దేశంలో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏది చేయాలన్నా కూడా ఈ పాన్ కార్డు ఉండాల్సిందే. పాన్ కార్డు అంటే పర్మినెంట్ అకౌంట్ నంబర్. ప్రస్తుతం బ్యాంకు ఖాతా తెరవాలి అన్నా కూడా ఈ పాన్ కార్డ్ ఉండాల్సిందే. అయితే అలాంటి పాన్ కార్డు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి చిన్నపిల్లలకు కూడా పాన్ కార్డు ఉండాలా? అంటే మేజర్లు అంటే 18 ఏళ్లు పైబడిన వారికే ఎక్కువ అవసరం అవుతుంది.

అయితే మరి మైనర్లు అంటే చిన్న పిల్లలకు పాన్ కార్డు అవసరం ఉంటుందా? ఉంటే వారికి ప్రత్యేకంగా కార్డులు ఉంటాయా? దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్న వివరాల్లోకి వెళితే.. అయితే పెద్దలకే కాదు18 ఏళ్ల లోపు మైనర్లు కూడా పాన్ కార్డు పొందవచ్చట. అయితే అందుకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే కార్డు అవసరం ఏర్పడుతుంది. మీరు మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుంటే లేదా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం మీ బిడ్డను నామినీగా పెట్టాలి అనుకున్నప్పుడు పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాను తెరిచేటప్పుడు మైనర్‌కు ఏదైనా ఆదాయ వనరు ఉన్న సందర్భాల్లో పాన్ కార్డు అవసరం అవుతుంది. దరఖాస్తును వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చేయాలి.

అయితే ఇందుకు ఆన్ లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం ముందుగా ఎన్ఎస్డీఎల్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ఫారమ్ 49A డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫారమ్ ని ఫిల్ చేయాలి. అలాగే అక్కడ ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవాలి. సరైన వర్గాన్ని ఎంచుకోవడం ద్వారా మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని పూరించాలి. పిల్లల వయస్సు సర్టిఫికెట్, అవసరమైన పత్రాలు, తల్లిదండ్రుల ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రుల సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. రుసుము రూ. 107 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడానికి ఫారమ్‌ను సమర్పించి, రసీదు సంఖ్యను నోట్ చేసుకోవాలి. వెరిఫై అయిన తర్వాత, మీరు 15 రోజులలోపు పాన్ కార్డ్‌ని అందుకుంటారు.