EV Cars in 2022: గత ఏడాది వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే?

భారత మార్కెట్లో ఈవీ కార్లకు ఉన్న డిమాండ్, క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటికి రాను రాను మార్కెట్లో డిమాండ్

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 07:00 AM IST

భారత మార్కెట్లో ఈవీ కార్లకు ఉన్న డిమాండ్, క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటికి రాను రాను మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. కాగా గత ఏడాది అనగా 2022లో విడుదలైన ఈవీ కార్లలో అనేక కంపెనీల నుంచి వచ్చిన కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి. అయితే భారత్ మార్కెట్‌లో తమ సత్తాను చాటుకొని కస్టమర్లను ఆకర్షించడంతో విజయం సాధించిన టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందా.. అందులో మొదటిది టాటా మోటార్స్ ద్వారా విడుదలైన టియాగో ఎలక్ట్రిక్ కార్ ఒకటి. ఇది 2022లో వచ్చిన కార్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా అద్భుతమైన ఫీచర్లతో ఉన్న ఈ కారు లాంచ్ అయిన రెండు నెలల్లోనే దాదాపుగా 20 వేల బుకింగ్స్ ను అందుకుంది.

19.2 KVH, 24 KVH బ్యాటరీ ప్యాక్‌లు ఉన్న ఈ టియాగో ఒక ఛార్జ్‌కి 250 నుంచి 315 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ కారు రూ. 8.49 లక్షలుగా ఉంది. అలాగే 2022లో విడుదలైన కార్ లలో BYD అటో 3 ఎలక్ట్రిక్ SUV కూడా ఒకటి. ఈ కారు ధర రూ. 33.99 లక్షలు. ఈ కారు అనేక రకాల ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 521 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మరొకకారు బెంగుళూరుకు చెందిన ప్రవేయిగ్ డైనమిక్ కంపెనీ అనే స్టార్టప్ కంపెనీ చెందినది. సరికొత్త సాంకేతికతతో నడిచే డిఫై ఎలక్ట్రిక్ SUVని గత ఏడాది విడుదల చేసింది. ఈ కారు రూ.39.50 లక్షలు. ఈ కారు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 500 కిమీ మైలేజీని ఇస్తుంది. గత ఏడాది విడుదల అయిన వాటిలో Mercedes Benz ద్వారా లాంచ్ అయిన కొత్త EQS 580 ఈవీ 2022 మోడల్ కారు కూడా ఒకటి.

కాగా ఈ కారు ధర1.55 కోట్లు గా ఉంది. ఈ కారు ని ఒకసారి చార్జ్‌కు 857 కిమీ మైలేజీని ఇస్తుంది. గత ఏడాది విడుదలైన వాటిలో టాప్ ఫైవ్ లో నిలిచిన కారు ముంబైకి చెందిన పర్సనల్ మొబిలిటీ వెహికల్ కంపెనీ కూడా మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా వినూత్న ఫీచర్లతో ఈఎస్ ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారును 2022లో లంచ్ అయింది. ఈ ఈవీ కారు ఒక్కో చార్జ్‌కు గరిష్టంగా 200 కిమీ మైలేజీని ఇస్తుంది. కాగా గత ఏడాది విడుదల అయిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాప్ ఫైవ్ లో ఈ ఐదు కార్లు నిలిచాయి. అంతే కాకుండా వినియోగదారులను ఈ ఐదు కార్లు ఎక్కువగా ఆకర్షించాయి.