Site icon HashtagU Telugu

Cheapest Electric Scooter: కేవలం రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. వివరాలు ఇవే?

Cheapest Electric Scooter

Cheapest Electric Scooter

టెక్నాలజీ రోజురోజుకీ డెవలప్ అవ్వడంతో మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనా వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుండడంతో వాహన వినియోగదారులు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వినియోగదారుల సంఖ్య,కొనుగోలుదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు నిత్యం ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే మార్కెట్ ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.25 వేలకే లభిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఎవాన్ ఇ ప్లస్ స్కూటర్ ప్రస్తుతం అతి తక్కువ ధరకే లభిస్తుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 25 వేలు. తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ మోడల్‌ను స్కూర్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

దీని టాప్ స్పీడ్ గంటకు 24 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనితో పాటు డెటెల్ ఈజీ ప్లస్ అనే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. దీని ధర రూ. 40 వేల నుంచి ఉంది. చీపెస్ట్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఇది రెండో స్థానంలో ఉంది. దీని రేంజ్ 60 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. అలాగే మరో యాంపియర్ రియో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. దీని ధర రూ. 44,500 నుంచి ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్లు వెళ్లొచ్చు. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.