వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాముఖ్యతను నొక్కి చెప్పే సంఘటన ఒకటి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, కొవిడ్ సమయంలో అతన్ని 17 మంది వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. అయితే ఎవ్వరూ కూడా ఆ బాలుడి సమస్యను సరిగ్గా గుర్తించలేకపోయారు. పిల్లాడికి ఎలాంటి వ్యాధి ఉందో తెలియక తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.
Bhubharathi : రేవంత్ తీసుకొచ్చిన భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..?
వైద్యులు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందని ఆ తల్లి చివరకు కొత్త మార్గం వెతకాల్సి వచ్చింది. తన కుమారుడి MRI స్కాన్ రిపోర్టులు, ఆరోగ్య లక్షణాలను ChatGPTకు వివరించింది. అత్యాధునిక AI మోడల్ అయిన ChatGPT అంచనాల ప్రకారం అది “Tethered Spinal Cord Syndrome” అనే అరుదైన సమస్య కావచ్చని సూచించింది. ఇది వెన్నుపూసకు సంబంధించిన ఒక వైకల్యం. ఇది ఒక చిన్నపిల్లలో ఉండే సమస్య కావడంతో, వైద్యులు సైతం తొలుత గుర్తించలేకపోయారు.
ChatGPT ఇచ్చిన సూచనల ఆధారంగా వైద్యులు మరోసారి పలు పరీక్షలు నిర్వహించగా, నిజంగానే అదే వ్యాధి ఉన్నట్లు తేలింది. వెంటనే శస్త్రచికిత్స చేసి బాలుడిని ఉపశమనానికి చేర్చారు. ఈ సంఘటనతో వైద్యరంగంలో AI సామర్థ్యం, అవసరాన్ని స్పష్టంగా చాటిచెప్పింది. సాధారణంగా అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు గుర్తించలేని సమస్యను ChatGPT గుర్తించి, చిన్నపిల్లాడి జీవితాన్ని మార్చేసింది. ఈ వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ, AI ప్రాముఖ్యతపై చర్చకు దారితీస్తోంది.